Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా ప్యాకేజీలతో పెద్ద చిక్కే!

By:  Tupaki Desk   |   19 Feb 2020 5:30 PM GMT
పాన్ ఇండియా ప్యాకేజీలతో పెద్ద చిక్కే!
X
పాన్ ఇండియా సినిమాలు నిర్మాత‌ల్ని మున‌గ చెట్టెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. బ‌డ్జెట్ల ప‌రంగా పారితోషికాల ప‌రంగా హీరోలు కొండెక్కి కూచోవ‌డం భ‌య‌పెట్టేస్తోంది. ఒక‌సారి కొండెక్కితే దించాలంటే చాలా క‌ష్ట‌మే. అదొక్క‌టే స‌మ‌స్య కాదు ఒక పాన్ ఇండియా సినిమా వ‌చ్చేశాక అటుపై లోక‌ల్ సినిమాలు చేస్తామంటే కుద‌ర‌దు. అభిమానుల నుంచి ఒత్తిడి అంతే పెద్ద రేంజులో ఉంటుంది. ఒక‌సారి పాన్ ఇండియా స్టార్ గా ముద్ర‌ప‌డితే అటుపై ప్ర‌భాస్ లానే సాహ‌సాలు చేయాల్సి ఉంటుంది. బాహుబ‌లి ఘ‌న‌విజ‌యం త‌ర్వాత ప్ర‌భాస్ స‌న్నివేశ‌మేమిటో తెలిసిందే. బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2 త‌ర్వాత సాహో ని మ‌రో పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కించారు. ఇప్పుడు జాన్ విష‌యంలోనూ పాన్ ఇండియా ఫ్లేవ‌ర్ నే ఫాలో చేస్తున్నాడు. దీంతో పాటే మార్కెట్ పెరిగింది కాబ‌ట్టి ప్ర‌భాస్ భారీగా పారితోషికం అందుకుంటున్నాడు. అలాగే ఆర్.ఆర్.ఆర్ కి ప‌ని చేస్తున్న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సైతం పారితోషికంలో ఆ రేంజులో ఉన్నాడు. ప్ర‌భాస్ - రాజ‌మౌళి ప్యాకేజీ కింగ్ లుగా మారారు.

ఆర్.ఆర్.ఆర్ రిలీజైతే తార‌క్ - ఎన్టీఆర్ ప‌రిస్థితి ఇంత‌కు మిన‌హాయింపేమీ కాదు. ఆ ఇద్ద‌రూ పాన్ ఇండియా స్టార్లు గా అటుపైనా పాన్ ఇండియా మూవీల్లోనే న‌టించాలి. పాన్ ఇండియా పారితోషికాలే అందుకోవాల్సి ఉంటుంది. అయితే తార‌క్ త‌దుప‌రి చిత్రానికి ఎలాంటి పారితోషికం అందుకుంటారు? అన్న‌ది చూస్తే త్రివిక్ర‌మ్ తో చేసే సినిమాకి ఆల్మోస్ట్ డ‌బుల్ పారితోషికం అందుకునే వీలుంటుంద‌ని ఫ్యాన్స్ అంచ‌నా వేస్తున్నారు. ఇక త్రివిక్ర‌మ్ సైతం అల వైకుంఠ‌పుర‌ములో స‌క్సెస్ తో పారితోషికం భారీగా పెంచే వీలుంద‌ని భావిస్తున్నారు. ఇక తార‌క్ పాన్ ఇండియా క్రేజును క్యాష్ చేసుకునేందుకు ఈ సినిమాని హారిక అండ్ హాసిని - ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు అంతే భారీగా బిజినెస్ చేస్తాయ‌న్న అంచ‌నా ఏర్ప‌డింది. రాధాకృష్ణ‌- క‌ల్యాణ్ రామ్ ఒక ర‌కంగా జాక్ పాట్ కొట్టిన‌ట్టే. అయితే ఎన్టీఆర్ 30 కోసం భారీగా బ‌డ్జెట్ ని కేటాయించాల్సిన స‌న్నివేశం త‌లెత్తింది ఇప్పుడు. పారితోషికాలు ప్యాకేజీలు అంటూ బోలెడంత హంగామా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. మ‌రోవైపు చిరు 152 (ఆచార్య‌)లో పాన్ ఇండియా స్టార్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు కాబ‌ట్టి .. అక్క‌డా చెర్రీకి భారీ ప్యాకేజీనే ముట్టే వీలుంటుంది. అయితే అది సొంత సినిమా కాబ‌ట్టి చ‌ర‌ణ్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ప్ర‌స్తుతానికి పాన్ ఇండియా స్టార్లు ద‌ర్శ‌కుల పారితోషికాలు ఏ రేంజులో ఉంటాయోన‌న్న బెంగ నిర్మాత‌ల్లో క‌నిపిస్తోంది. బిజినెస్ ప‌రంగా ఆ క్రేజు క‌లిసొస్తున్నా ముందు పారితోషికాలు బ‌డ్జెట్లు బాగా పెంచాల్సిన స‌న్నివేశ‌మే ఇబ్బందిక‌రం అన్న టాక్ వినిపిస్తోంది. ఇక‌పై చ‌ర‌ణ్ - తార‌క్ - మ‌హేష్- ప‌వ‌న్ వీళ్లంతా పాన్ ఇండియా స్టార్లుగానే వెలిగే ఛాన్సుంటుంది కాబ‌ట్టి ప్యాకేజీలు ఆ లెవ‌ల్లోనే ముట్ట‌జెప్పాలన్న‌మాట‌.