Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్.. రెండు గంటలకు ఎంత?

By:  Tupaki Desk   |   27 July 2018 10:08 AM IST
ఎన్టీఆర్.. రెండు గంటలకు ఎంత?
X
గత కొన్నేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఇంతింతై అన్నట్లుగా ఎదిగాడు. నాలుగేళ్ల ముందు అతడి మార్కెట్ ఎక్కడో ఉండేది. తారక్ తర్వాత హీరోలైన స్టార్లు అతడిని మించి పోతే.. అతను మాత్రం వెనుకబడిపోయాడు. వరుస డిజాస్టర్లు అతడిని బాగా వెనక్కి నెట్టేశాయి. అలాంటి టైంలో ‘టెంపర్’తో హిట్టు కొట్టి.. ఆ తర్వాత ఆ సక్సెస్ ను నిలబెట్టుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్లాడు. తన మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు. మూడేళ్ల వ్యవధిలో ఆల్మోస్ట్ డబులైంది అతడి మార్కెట్. రెమ్యూనరేషన్ కూడా అందుకు తగ్గట్లే పెరిగింది. ఇదే సమయంలో బుల్లితెర వైపు అడుగులేశాడు. ‘బిగ్ బాస్’తో అదరగొట్టాడు. దానికి భారీగా పారితోషకం అందుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్.. ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ‘ఢీ 10’ ఫైనల్స్ కోసం అతనందుకున్న పారితోషకమే రుజువు.

‘ఢీ 10’ ఫైనల్స్ కోసం రెండు గంటల సమయం కేటాయించిన ఎన్టీఆర్.. అందుకోసం రూ.25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. రెండు గంటలకే ఇంత మొత్తం అంటే ఎన్టీఆర్ రేంజేంటో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ స్టార్లతో పోలిస్తే ఇది తక్కువే కావచ్చు కానీ.. టాలీవుడ్ రేంజికి ఇది మంచి ఫిగరే. పారితోషకానికి పూర్తి న్యాయం చేస్తూ ఆ రెండు గంటలూ ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఆద్యంతం ఆకట్టుకున్నాడు. పోటీదారులకు ఇచ్చిన ఇన్ పుట్స్ కాచవ్చు.. ఒక్కొక్కరి పెర్ఫామెన్స్ మీద వెల్లడించిన అభిప్రాయాల విషయంలో కావచ్చు.. మధ్యలో తనదైన శైలిలో చేసిన డ్యాన్స్ ద్వారా కావచ్చు.. షోకు పూర్తి విలువ చేకూర్చాడు తారక్. ఎన్టీఆర్ పాల్గొన్న ఎపిసోడ్ కు 13.9 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. ‘ఢీ’ చరిత్రలోనే ఇది హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్. ఇటీవలే సెలక్ట్ మొబైల్ సంస్థకు ప్రచారకర్తగా ఎంపికైన ఎన్టీఆర్.. దాంతో ఒప్పందం కింద ఏడాదికి రూ.1.25 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు.