Begin typing your search above and press return to search.

అన్నా అని పిలవద్దని చెప్పిన ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   30 July 2017 8:49 AM GMT
అన్నా అని పిలవద్దని చెప్పిన ఎన్టీఆర్
X
మొదటి నుండి బిగ్ బాస్ షోను చూస్తుంటే ఒక విషయం మాత్రం చాలా విసుగ్గా ఉంటుంది. అదేంటంటే.. అసలు ఎన్టీఆర్ కంటే వయస్సులో పెద్దవారు కూడా మనోడ్ని అన్నా అన్నా అంటూ పిలుస్తుంటే.. వామ్మో వినడానికే ఎటకారంగా ఉంది. ఏదో చిన్నప్పుడే స్టార్ హీరో అయ్యాడు కాని.. అయినంత మాత్రాన మనోడ్ని అన్నా అని పిలిస్తే ఎలా? అదే విషయం అక్కడ బిగ్ బాస్ కంటెస్టంట్ సింగర్ కల్పనకు ఎవరైనా చెప్పండయ్యా బాబూ అంటూ ప్రేక్షకులు అభిమానులూ తల పట్టుకున్నారు.

ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ లో హీరో ఎన్టీఆర్ ఒక టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ లో ఎవరినైతే తాము విలన్ గా భావిస్తామో వారిని అర్జెంటుగా తీసుకొచ్చి అక్కడున్న ఐరన్ సింహాసనంపై కూర్చోబెట్టి వారి గురించి చెప్పాలి. అందరూ కలసి సింగర్ కల్పనను కూర్చోబెట్టాశారు. మొదటివారం హస్ మేట్ గా ఉన్న కల్పన చాలా మంచిదని.. తమను బాగా చూసుకుందని.. కాని రెండోవారంలో కెప్టెన్ అయిన తరువాత మాత్రం ఆమె సరిగ్గా మాట్లాడట్లేదని ప్రవర్తనలో మార్పొచ్చిందని అందరూ తమ కామెంట్ల చిట్టా విప్పేశారు. ఈ సందర్బంలో తను ఎక్సప్లెనేషన్ ఇస్తూ.. 'అన్నా అన్నా' అంటూ పదే పదే పిలుస్తుండటంతో.. 'అమ్మా నన్ను దయచేసి అన్నా అని పిలవకండి' అంటూ నిర్మొహమాటంగా తనదైన స్టయిల్లో చెప్పేశాడు ఎన్టీఆర్. అందుకు ఆమె స్పందిస్తూ.. 'అయితే తారక్ గారూ అని పిలుస్తా' అని చెప్పింది. దానితో అందరూ లోలోపలే నవ్వుకున్నారు.

ఏదేమైనా కూడా ఈ పెద్దావిడ అన్నా అని పిలవడం ఆపేస్తే.. ఖచ్చితంగా బిగ్ బాస్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీలవుతారు. లేకపోతే ఆవిడ వయసేంటి ఎన్టీఆర్ ను అన్నా అని పిలవడమేంటి? తమ్ముడూ అని పిలిచినా హ్యాపీగా ఫీలయ్యేవారు జనాలు.