Begin typing your search above and press return to search.
ఇది వేడుకల సమయం కాదు.. ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ లేఖ
By: Tupaki Desk | 19 May 2021 4:30 AM GMTరేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు అభిమానులు సిద్దం అయ్యారు. సాదారణంగా అయితే ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున ప్లెక్సీలు.. హోర్డింగ్ లు.. కేక్ లు.. సెలబ్రేషన్స్ రచ్చ రచ్చ ఉండేవి. కాని ఈ ఏడాది మాత్రం ఆ పరిస్థితి లేదు. అయినా కూడా సాధ్యం అయినంత వరకు ఎన్టీఆర్ పుట్టిన రోజును వైభవంగా జరుపుకోవాలని ఫ్యాన్స్ భావించారు. కాని ఎన్టీఆర్ మాత్రం అభిమానులకు ఈ సమయంలో వేడుకలు వద్దంటూ ఒక లేఖను విడుదల చేశాడు. మీరు జాగ్రత్తగా ఉంటూ మీ కుటుంబంను జాగ్రత్తగా చూసుకోండి అంటూ లేఖలో ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఇదే సమయంలో తాను కరోనా నుండి కోలుకుంటున్నట్లుగా కూడా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
ఇంకా అభిమానులకు ఎన్టీఆర్ విడుదల చేసిన లేఖలో... నా అభిమానులందరికి పేరు పేరున కృతజ్ఞతలు. గత కొన్ని రోజులుగా మీరు పంపుతున్న మెసేజ్ లు వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకు ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకుని కోవిడ్ ను జయిస్తానని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజు సందర్బంగా చేసే కార్యక్రమాలు ఒక ఆశ్వీర్వాదంగా భావిస్తాను. కాని ఈ ఏడాది మాత్రం ఇంటి పట్టునే ఉండండి. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక.
ఇది వేడుకలకు సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్దం చేస్తోంది. కనిపించని శత్రువులతో యుద్దం చేస్తున్న డాక్టర్లు.. నర్సులు ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు సంఘీభాగం తెలుపుదాం. జీవనోపాది కోల్పోయిన వారికి అండగా నిలబడుదాం. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటూ సాధ్యం అయినంత వరకు ఉపకారం చేయండి. త్వరలోనే మన దేశం కరోనాను జయిస్తుందని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.. మీ నందమూరి తారక రామారావు.