Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ వరుస యాక్సిడెంట్స్‌ పై తారక్‌ స్పందన

By:  Tupaki Desk   |   8 Oct 2018 4:14 AM GMT
ఫ్యామిలీ వరుస యాక్సిడెంట్స్‌ పై తారక్‌ స్పందన
X
నందమూరి కుటుంబంను యాక్సిండెట్స్‌ వెంటాడుతున్నాయి. ఈమద్య కాలంలో ఆ ఫ్యామిలీలో ఇద్దరు యాక్సిడెంట్స్‌ కారణంగా మృతి చెందగా - ఎన్టీఆర్‌ యాక్సిడెంట్‌ లో తీవ్ర గాయాల పాలయిన విషయం తెల్సిందే. నందమూరి ఫ్యామిలీకి వాహన గండం ఉందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎన్టీఆర్‌ పెద్ద అన్న జానకి రామ్‌ హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై యాక్సిడెంట్‌ లో మృతి చెందాడు. అంతకు ముందు ఎన్టీఆర్‌ కూడా యాక్సిడెంట్‌ కు గురయ్యాడు. అయితే అదృష్టం బాగుండటంతో ఎన్టీఆర్‌ బతికాడు. ఇక హరికృష్ణ ఇటీవల యాక్సిడెంట్‌ లో మృతి చెందిన విషయం తెల్సిందే.

ఇలా వరుసగా తమ ఫ్యామిలీ మెంబర్స్‌ కు యాక్సిడెంట్‌ లు అవ్వడంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. ఈ యాక్సిడెంట్స్‌ ను నందమూరి ఫ్యామిలీకి శాపంగా అభిమానులు ఆందోళన చెందుతున్న విషయమై ఎన్టీఆర్‌ ను ప్రశ్నించిన సమయంలో.. ఈ యాక్సిడెంట్‌ లను ఆ కోణంలో అస్సలు చూడవద్దని - ఇలాంటి సంఘటనలను విశ్లేషించుకోకుండా ఉండటం బెటర్‌ అన్నాడు. మా కుటుంబానికే ఎందుకు ఇలా జరుగుతుందో అనే బాధ మొదట వేసిందని - కాని రాతను ఎవరు మార్చలేరని - అంతా కూడా నిమిత్త మాత్రులం కనుక జరిగినదాన్ని సర్దుకుని వెళ్లడమే మనం చేయగలమని - ఎక్కువ ఆలోచించి మన జీవితంలో ముందుకు వెళ్లకుండా ఉండలేమని అన్నాడు.

యాక్సిడెంట్స్‌ జరుగుతున్నాయి కదా అని నేను కారు నడుపకుండా ఉండటం లేదని - కాకుంటే కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్‌ అన్నాడు. ఈ జీవితంలో ఎప్పుడు ఎలాంటి మలుపు ఉంటాయో అనేది ఎవరికి అర్థం కాని విషయమని - అన్నింటిని అంగీకరిస్తు ముందుకు వెళ్లినప్పుడే అంతా సాఫీగా సాగుతుందని ఎన్టీఆర్‌ పేర్కొన్నాడు.

తాజాగా ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. దసరా కానుకగా ఈ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కు జోడీగా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే.