Begin typing your search above and press return to search.

బాబాయ్‌.. నేను.. ఆల్‌ ఈజ్‌ వెల్‌

By:  Tupaki Desk   |   9 Jan 2016 3:14 PM GMT
బాబాయ్‌.. నేను.. ఆల్‌ ఈజ్‌ వెల్‌
X
న‌ట‌సింహా బాల‌కృష్ణ‌ - జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య క్లాషెస్ గురించి ఇటీవ‌లి కాలంలో ర‌క‌ర‌కాల పుకార్లు వెబ్‌ లో హ‌ల్‌ చ‌ల్ చేశాయి. బాబాయ్‌ తో అబ్బాయ్ పోటీకొస్తున్నాడు. కావాల‌నే బ‌రిలో దిగుతున్నాడు అంటూ ప్ర‌చారం సాగించారు. అయితే ఇలా ఎందుకు పోటీప‌డాల్సొచ్చింది? అని ఎన్టీఆర్‌ ని ప్ర‌శ్నిస్తే అందుకు ధీటైన స‌మాధానం ఇచ్చాడు యంగ్ య‌మ‌.

బాబాయ్‌కి, నాకు మ‌ధ్య ఏమైనా ఉంటే అది చెప్పాల్సింది మేం క‌దా. మీరెలా అనేసుకుంటారు. ఎవ‌రు పుట్టిస్తున్నారు ఈ క‌థ‌లన్నీ. ఏనాడైనా మా అంత‌ట మేముగా ప‌బ్లిక్‌ లోకి వ‌చ్చి ఈ విష‌యంపై మాట్లాడామా? అయినా ఇలాంటి పుకార్లు ఎలా పుడ‌తాయి? అని ప్ర‌శ్నించాడు ఎన్టీఆర్‌. ప్ర‌తియేటా సంక్రాంతికి నాలుగైదు సినిమాలు పోటీప‌డ‌డం అన్న‌ది అనాదిగా వ‌స్తున్న‌దే. ఈరోజు కొత్త‌గా ఏం లేదే? అలా వ‌చ్చి హిట్లు కొట్టిన సినిమాలెన్నో. ఇప్పుడు కూడా అలానే వ‌స్తున్నాం అంతే అంటూ క్లారిటీ ఇచ్చాడు. బాబాయ్ ఒంటి మీద ఈగ వాలినా ఊరుకోను అన్నంత ఘాటైన స‌మాధాన‌మిచ్చాడు ఎన్టీఆర్‌. ఇదివ‌ర‌క‌టిలానే త‌న భ‌క్తిని ప్ర‌ద‌ర్శించాడు.

పైగా సంక్రాంతి సీజన్లో వచ్చే సినిమాలన్నీ మాంచి రిజల్టు రాబట్టుకోవాలని కోరుకున్నాడు తారక్‌. అది సంగతి. ఆల్‌ ఈజ్‌ వెల్‌ అంట.