Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ‘ఊపిరి’ ఎందుకు చేయలేదంటే..
By: Tupaki Desk | 11 Jan 2016 4:12 AM GMTసీనియర్ హీరో అక్కినేని నాగార్జున - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేస్తారని గత ఏడాది కొన్ని నెలల పాటు గట్టి ప్రచారమే జరిగింది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడని కూడా వార్తలొచ్చాయి. కట్ చేస్తే.. ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాడు. నాగార్జున.. కార్తితో కలిసి వంశీ దర్శకత్వంలోనే ‘ఊపిరి’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇంతకీ ఎన్టీఆర్ - నాగ్ కాంబినేషన్లో వంశీ చేయాలనుకున్నది ‘ఊపిరి’ చిత్రమేనా.. అదే నిజమైతే ఎన్టీఆర్ ఆ ప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకున్నాడు.. అన్న సందేహాలు జనాల్లో అలాగే ఉండిపోయాయి. ఐతే ఈ సందేహాలకు ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు.
‘ఊపిరి’ స్క్రిప్టు తన దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే అని.. అది తనకెంతో నచ్చిందని ఎన్టీఆర్ చెప్పాడు. ఐతే డేట్ల విషయంలో ఇబ్బందుల వల్లే తానా సినిమా చేయలేకపోయానన్నాడు. ‘‘ఆ సినిమా అనుకున్న సమయంలోనే నేను ‘నాన్నకు ప్రేమతో’కు డేట్లు ఇచ్చాను. నా కోసం వెయిట్ చేస్తే నాగార్జున డేట్లు వేస్ట్ అయిపోతాయి. అందుకే నేనా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను. ఐతే అది మంచి స్క్రిప్టు. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నాగార్జునతో చేస్తాను. మల్టీస్టారర్లు చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు’’ అని ఎన్టీఆర్ వెల్లడించాడు. నాగార్జునతో తనకు మంచి అనుబంధం ఉందని.. అందుకే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు వెళ్లానని ఎన్టీఆర్ చెప్పాడు.