Begin typing your search above and press return to search.

ఫారెస్టులో ఎన్టీఆర్ పెద్దపులిలా పరిగెత్తాడు: రాజమౌళి

By:  Tupaki Desk   |   10 Feb 2022 3:32 AM GMT
ఫారెస్టులో ఎన్టీఆర్ పెద్దపులిలా పరిగెత్తాడు: రాజమౌళి
X
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా 'ఆర్ ఆర్ ఆర్' కోసం ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ - చరణ్ నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ కావడం .. చారిత్రక నేపథ్యంతో ముడిపడిన కథ కావడం ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడానికి కారణమవుతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా చివరికి మార్చి 25వ తేదీన విడుదల తేదీగా సెట్ చేసుకుంది. దాంతో ఎన్ని వేల థియేటర్స్ లో ఈ సినిమాను వదులుతున్నారు? ఏ స్థాయి రికార్డులను ఈ సినిమా నమోదు చేయనుందనే విషయం కుతూహలాన్ని పెంచుతోంది.

ఇక ఈ సినిమాను గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు రాజమౌళి చెబుతున్న ఒక్కో విషయం మరింతగా ఆసక్తిని .. అంచనాలను పెంచుతూ వెళుతున్నాయి. కథాపరంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ. ప్రతి యాక్షన్ బ్లాక్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే యాక్షన్ సీన్ .. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్ ఉత్కంఠభరితులను చేస్తాయని రాజమౌళి చెప్పారు. సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని అన్నారు. ఇక తాజాగా ఆయన ఎన్టీఆర్ - చరణ్ లకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ గురించి చెప్పిన ఇంటర్వ్యూలను మేకర్స్ వదిలారు.

రాజమౌళి మాట్లాడుతూ .. "ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఇంట్రడక్షన్ సీన్ ను 'బల్గెరియా' ఫారెస్టులో చిత్రీకరించాము. ఎన్టీఆర్ పాదాలకి చెప్పులుగానీ .. షూ గాని లేకుండా ఫారెస్టులో పరుగెత్తే సీన్ అది. ఆయన ఒక పులిలా పరిగెత్తుతున్నట్టుగా నాకు అనిపించింది. ఆ సీన్ నేను అనుకున్నట్టుగా రావడానికి తాను చాలా కష్టపడ్డాడు. నిజంగానే ఆ సీన్ అద్భుతంగా వచ్చింది. ఈ సీన్ తెరపై వస్తున్నప్పుడు ఎన్టీఆర్ అభిమానులు విజిల్స్ కొట్టకుండా ఉండలేరు. ఎన్టీఆర్ ఎనర్జీని ఫస్టు సీన్ నుంచే చెప్పాలనే నా కోరిక నెరవేరింది.

ఇక చరణ్ విషయానికి వస్తే తను కూడా ఎంతో అంకితభావంతో ఈ సినిమాను చేశాడు. ఈ సీన్ చేయాలి అంటే .. ఎందుకు ఏమిటి అడగకుండా ఆయన చేసేవాడు. ఆయన అంకితభావం చూసి నేను షాక్ అయ్యేవాడిని. నా అంచనాలను అందుకోవడానికి ఆయన ఎంతకష్టమైనా పడేవాడు. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత చరణ్ ను చూడగానే నాకు కన్నీళ్లు వచ్చాయి. నా కంటే కసితో .. నాకంటే కృషి చేసే హీరోలు దొరకడమే ఈ సినిమా సక్సెస్ కి మొదటి మెట్టుగా నేను భావిస్తున్నాను.

ఎన్టీఆర్ - చరణ్ లతో నాకు ఒక విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది. అందువలన ఒక రకమైన ప్రేమ పూర్వకమైన వాతావరణంలో షూటింగు చేయగలిగాము. షూటింగు పరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, మా మధ్య గల ఆత్మీయత .. అనుబంధం కారణంగా మాకు పెద్ద కష్టంగా అనిపించలేదు. ప్రతి సీన్ ను ఇష్టపడి చేయడం వల్లనే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. సినిమా చూసిన తరువాత ఆడియన్స్ కూడా అదే మాట చెబుతారు. ఈ సినిమా విషయంలో నేను నా గురించి ఆలోచించలేదు.

నాపై ఎన్టీఆర్ - చరణ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. ఈ సినిమాను వాళ్ల కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాలనే అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.