Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ చరణ్ సినిమా పేరెత్తిన వేళ..
By: Tupaki Desk | 10 Jan 2016 3:30 PM GMTఓ నందమూరి కథానాయకుడు ఓ మెగా హీరో సినిమా గురించి ప్రస్తావించడం.. ఆ సినిమా హిట్టవడం గురించి చెప్పడం అరుదైన విషయమే కదా. ఎన్టీఆర్ ఇదే పని చేశాడు. రామ్ చరణ్ ‘నాయక్’ సినిమా ప్రస్తావన తెచ్చాడు. అది హిట్టయిందన్న సంగతి గుర్తు చేశాడు. ఇంతకీ ఎన్టీఆర్ నోట ‘నాయక్’ మాట ఎందుకు వినిపించింది? తెలుసుకుందాం పదండి.
ఈ సంక్రాంతికి ఎన్నడూ లేని విధంగా నాలుగు క్రేజ్ ఉన్న సినిమాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ మూడు పెద్ద సినిమాలుండటం ఆసక్తి రేపుతోంది. ఇలా ఒకేసారి పెద్ద సినిమాలు పోటీ పడటం మంచిది కాదు కదాఅని ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావిస్తే.. మూడేళ్ల కిందట సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - నాయక్ సినిమాలు సంక్రాంతికి పోటీ పడి హిట్టవడం గురించి ప్రస్తావించాడు ఎన్టీఆర్.
'ఒకప్పుడు సినిమాలు ఏడాది ఏడాదిన్నర ఆడేవి. తర్వాత 175 రోజులు - 100 రోజులు - 50 రోజులు - 25 రోజులు.. చివరికి ఇప్పుడు రెండు వారాలు మాత్రమే ఆడే పరిస్థితి వచ్చేసింది. ఒక సినిమా ఎన్ని రోజులు ఆడిందనేది కాదు, ఎంత కలెక్ట్ చేసిందనేదే ఇప్పుడు కీలకం. అందుకే పెద్ద సినిమాల్ని మంచి సీజన్లోనే రిలీజ్ చేసుకోవాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతికి నాలుగైదు సినిమాలు విడుదలవడం కొత్తేం కాదు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు - నాయక్ సినిమాలు ఒకే ఏడాది విడుదలై చాలా బాగా ఆడాయి. ఈ సంక్రాంతికి నా సినిమాతో పాటు వస్తున్న మిగతా మూడు సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. బాబాయి సినిమా ఆడాలి. సోగ్గాడే చిన్నినాయనా, ఎక్స్‌ప్రెస్ రాజా కూడా బాగా ఆడాలి'' అని ఎన్టీఆర్ అన్నాడు.