Begin typing your search above and press return to search.
భలే ఫొటో.. ఎన్టీఆర్ కొడుక్కి ‘పాల’ శిక్ష
By: Tupaki Desk | 10 Jun 2018 5:02 AM GMTజూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ కు పెద్ద కష్టమే వచ్చింది. అతడి పట్ల ఓ వ్యక్తి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆ వ్యక్తి అతడిని భయపెడుతున్నారు. శిక్షిస్తున్నారు. అతడితో బలవంతంగా.. అయిష్టంగా ఒక పని చేయిస్తున్నారు. ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ కళ్ల ముందే జరుగుతోంది. కొడుకంటే ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ అతను ఏమీ చేయలేకపోతున్నాడు. సుపుత్రుడిని రక్షించలేకపోతున్నాడు. ఇంతకీ ఎన్టీఆర్ కొడుకుని అంతగా కష్టపెట్టేస్తున్న ఆ వ్యక్తి ఎవరనుకున్నారు... లక్ష్మీ ప్రణతి. ఎన్టీఆర్ భార్య.. అభయ్ రామ్ తల్లి. ఆమె అతడికి వేసింది ‘పాల’ శిక్ష.
పిల్లల పెరుగుదలలో పాలు కీలకం. ఇష్టమున్నా లేకపోయినా పిల్లలకు రోజూ పాలు తాగించాల్సిందే. ఈ విషయంలో పిల్లలు చాలానే మారాం చేస్తారు. అయినా విడిచిపెట్టడానికి వీల్లేదు. అభయ్ ని కూడా ప్రణతి వదలట్లేదట. ఈ విషయంలో తాను కూడా ఏమీ చేయలేనని చేతులెత్తేశాడు తారక్. లక్ష్మీప్రణతి కోపంగా చూస్తుంటే.. భయపడుతూ పాలు తాగుతున్న అభయ్ ఫొటోను షేర్ చేస్తూ... ‘‘వాడు తాగాల్సిన కోటా పాలకు సంబంధించి అభయ్ ను వాళ్లమ్మ నుంచి కాపాడలేం’’ అంటూ సరదా వ్యాఖ్య జోడించాడు తారక్ తన ట్విట్టర్ పేజీలో. చాలా క్యూట్ గా.. ఫన్నీగా అనిపిస్తున్న ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఎప్పుడూ కొడుకుతో తన అనుబంధాన్ని చాటే ఫొటోలే షేర్ చేసే తారక్.. కొంచెం భిన్నంగా అనిపించే ఈ పిక్ తో ఆసక్తి రేకెత్తించాడు.