Begin typing your search above and press return to search.

లోక్ స‌త్తా జ‌య‌ప్ర‌కాష్ లానే ఎన్టీఆర్ వ్య‌వ‌సాయం

By:  Tupaki Desk   |   2 Aug 2021 6:30 AM GMT
లోక్ స‌త్తా జ‌య‌ప్ర‌కాష్ లానే ఎన్టీఆర్ వ్య‌వ‌సాయం
X
హైద‌రాబాద్ ఔట‌ర్ లో మాజీ ఐఏఎస్ అధికారి .. లోక్ స‌త్తా అధినేత‌ జ‌య ప్ర‌కాష్ నారాయ‌ణ వంద‌ల ఎక‌రాల్లో సేంద్రియ వ్య‌వ‌సాయం చేస్తున్నారు. స్ప్రింక్ల‌ర్ల సాయంతో నీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌ను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ కూర‌గాయ‌ల‌కు పంట‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఆయ‌న‌తో పాటు ప‌లువురు సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు.. ప్ర‌భుత్వ అత్యున్న‌త ఉద్యోగులు హైద‌రాబాద్ ఔట‌ర్ లో వంద‌ల ఎక‌రాల్లో సేంద్రియ వ్య‌వ‌సాయం చేస్తున్నారన్న‌ది తెలిసింది త‌క్కువ మందికే.

ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించారు. ఎన్టీఆర్ ఇటీవల శంకర్ పల్లిలో హైదరాబాద్ కు దగ్గరగా ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ఫోటోలు అభిమానుల్లో వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ భూమిలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభిస్తారని విలాసవంతమైన ఫామ్ హౌస్ ని నిర్మిస్తారని అభిమానులు గుస‌గుస‌లాడుతున్నారు.

నిజానికి ఎన్టీఆర్ మామ నార్నే శ్రీ‌నివాస‌రావుకు హైద‌రాబాద్ ఔట‌ర్ లో వేలాది ఎక‌రాలున్నాయి. సికింద‌రాబాద్ లో గోదావ‌రి.. విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కింది మొద‌లు కిలోమీటర్ల పొడ‌వున ఉన్న భారీ వాల్ పై `నార్నే ఎస్టేట్స్ అంటూ ప్రింట్ క‌నిపిస్తుంది. ఇది వంద‌ల వేల ఎక‌రాల స్థ‌లం. కానీ అలాంటి చోట కాకుండా తార‌క్ త‌న‌కు అనువైన చోట ఆరున్న‌ర ఎక‌రాలు కొనుగోలు చేశారు.

అయితే తార‌క్ ఇలా ఔట‌ర్ లో ఫామ్ హౌస్ ప్లాన్ చేయ‌డానికి కార‌ణం ..
అతను సెట్స్ కి వెళ్ల‌కుండా తీరిక‌గా ఉన్న‌ప్పుడు ప్రకృతితో సమయం గడపడానికి ఆసక్తిని క‌న‌బ‌రుస్తారు. సేంద్రియ వ్యవసాయానికి అనువైనదిగా చేయడానికి ఎన్టీఆర్ పెద్ద మొత్తాన్ని పెట్టుబ‌డిగా పెడ‌తారు. నిజానికి తార‌క్ కి ఇప్ప‌టికే ఈ విధానాన్ని అనుస‌రించే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్.. కండల హీరో స‌ల్మాన్ ఖాన్ స్ఫూర్తి అని అనుకోవాలి.

తార‌క్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ. ఆర్.ఆర్.ఆర్ చిత్ర‌ బృందంతో కలిసి షూటింగ్ కోసం జార్జియా వెళ్లారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13 న విడుదల చేయ‌నున్నారు. త‌దుప‌రి కొర‌టాల‌తో సినిమాని ప్రారంభించాల్సి ఉంది. తార‌క్ హోస్టిగ్ చేస్తున్న‌ ఎవరు మీలో కోటీశ్వరులు? టీవీ షోని ఆగస్టు 14 నుండి జెమిని టీవీలో ప్రసారం చేయడం ప్రారంభిస్తారు. కొర‌టాల‌తో మూవీ త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో.. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తోనూ తార‌క్ ఓ సినిమా చేయాల్సి ఉంటుంది.

ఎన్టీఆర్-చ‌ర‌ణ్ దోస్తీ లైక్ లు క్లిక్ ల‌తో జోష్‌

2021 మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. డెడ్ లైన్ ప్ర‌కారం.. ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు రాజ‌మౌళి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇప్ప‌టికే ప్ర‌చారంలో స్పీడ్ ని పెంచారు. ముఖ్యంగా ఆర్‌.ఆర్‌.ఆర్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన‌ మొదటి పాట దోస్తీ ఈరోజు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా అధికారికంగా విడుదలై అంత‌ర్జాలంలో దూసుకెళుతోంది. ఏకకాలంలో ఐదు భాషల్లో ఆవిష్కరించ‌గా.. ఈ పాట యూట్యూబ్ లో అత్యంత వేగంగా వైర‌ల్ అయ్యింది. అత్య‌ధిక లైక్ ల‌తో దూసుకెళుతున్న గ్రేట్ సాంగ్ గా రికార్డుల‌కెక్కింది.

ఈ పాట‌కు టాలీవుడ్ హిస్ట‌రీలోనే అత్య‌ధిక‌ లైక్ లు అతి త‌క్కువ స‌మ‌యంఓ ద‌క్కాయి. ఇది అసాధార‌ణ రికార్డ్. స్నేహితుల దినోత్స‌వాన రెండు శక్తివంతమైన ప్రత్యర్థి శక్తులు రామరాజు - భీమ్ #దోస్తులుగా కలిసి రావడం సూచిస్తోంది అని జ‌క్క‌న్న ఆనందం వ్య‌క్తం చేశారు. ప్రధాన పాత్రల మధ్య స్నేహం నేపథ్యంలో అద్భుత‌మైన లిరిక‌ల్ వ్యాల్యూతో సంగీత దర్శకుడు MM కీరవాణి అద్భుత‌మైన బాణీని స‌మ‌కూర్చారు. హేమ చంద్ర స‌హా ప‌లువురు సంగీత ద‌ర్శ‌కులు ఆయా భాష‌ల కోసం ఈ పాట‌ను ఆల‌పించారు. 24 గంట‌ల్లో అత్యధిక వీక్ష‌ణ‌ల‌తో దోస్తీ జోష్ గూగుల్ లో కొన‌సాగుతోంది.