Begin typing your search above and press return to search.
రొమాంటిక్ ఫైట్ కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్
By: Tupaki Desk | 5 May 2018 5:49 AMమన స్టార్ హీరోల యాక్షన్ సీన్స్ లో చాలా అప్గ్రేడ్ అవుతున్నారని చెప్పాలి. ఒకప్పుడు హీరో ఎలా ఉన్నా విలన్ ఎంత గట్టిగా ఉన్న కొడితే ఆకాశంలోకి వెళ్లడం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు మన హీరోల పర్సనాలిటీల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఫిట్ నెస్ కోసం వారు శ్రమిస్తున్న తీరు అభినందించాల్సిన విషయం. పాత్ర కోసం పూర్తిగా మారిపోయి వారి టాలెంట్ తో తెరపై యాక్షన్ వెధర్ ని ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. ముఖ్యంగా రెయిన్ లో ఒకప్పుడు రొమాంటిక్ సాంగ్ లు ఎక్కువగా వచ్చేయి.
అయితే మన దర్శకుల ఆలోచనలకు వానలో కూడా మంచి యాక్షన్ సీన్స్ బయటపడుతున్నాయి. జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. "సాంగ్ లోనే కాదు చోటు ఫైట్ లో కూడా రెయిన్ రొమాంటిక్ గా ఉంటుంది" అని పవన్ కళ్యాణ్ చెప్పడం అందరికి గుర్తుండే ఉంటుంది. త్రివిక్రమ్ రాసిన ఆ డైలాగ్ మరోసారి కార్యరూపం దాల్చనుంది. ఈ సారి ఎన్టీఆర్ త్రివిక్రమ్ యాక్షన్ సీక్వెన్స్ లలో రొమాంటిక్ గా ఫైట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు.
రీసెంట్ గా స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ ని జరుకుంటోంది. ప్రస్తుతం ఫైట్ ఎపిసోడ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కిస్తున్నారు. అయితే అందులో తారక్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడట. వర్షంలో జరిగే ఆ యాక్షన్ ఫైట్ లో తారక్ షర్ట్ లేకుండా కనిపించనున్నాడు. ఇంతకుముందు తారక్ టెంపర్ సినిమాలో తన ఫిట్ నెస్ తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ సినిమాలో కూడా మరో విధంగా ఆకట్టుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఆ సిక్స్ ప్యాక్ కోసం తారక్ దాదాపు కొన్ని నెలల వరకు స్టీవెన్స్ అనే ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ చేసిన సంగతి తెలిసిందే.