Begin typing your search above and press return to search.
రెండు రూపాల్లో వీర రాఘవ
By: Tupaki Desk | 20 Jun 2018 7:36 AM GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. జై లవకుశ విడుదలై ఎనిమిది నెలలు దాటేసింది. షూటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా మొదలుపెట్టాక వేగం తగ్గటం లేదు. ఫస్ట్ లుక్ లో తారక్ సిక్స్ ప్యాక్ మీద ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో టైటిల్ తో పాటు బ్యాక్ డ్రాప్ మీద కొద్దిగా ఐడియా వచ్చింది. ఇప్పుడు దీనికి మరింత ఊతమిచ్చేలా మరో ఎగ్జైటింగ్ న్యూస్ ఫాన్స్ కోసం వచ్చేసింది.
అదేంటంటే యంగ్ టైగర్ పాత్ర ఇందులో రెండు షేడ్స్ లో ఉంటుందట. ఫస్ట్ హాఫ్ లో సిద్దార్థ్ గౌతమ్ అనే సాఫ్ట్ ఇంజనీర్ పాత్రలో కూల్ గా కనిపిస్తే సెకండ్ హాఫ్ లో వీర రాఘవగా మరో కోణం చూపిస్తాడట. కీలకమైన పాత్ర ఇదే అని టైటిల్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఫాన్స్ కు వస్తున్న డౌట్ ఒకటే. వీర రాఘవ ఉనికిని దాచుకోవడం కోసం గౌతమ్ గా మారతాడా మారతాడా లేక ఈ గౌతమ్ వీర రాఘవగా మారాల్సిన పరిస్థితి వస్తుందా అని. ప్రస్తుతానికి ఇది సస్పెన్స్.
తారక్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. ఆది-సింహాద్రి-సాంబ తర్వాత మళ్ళి ఆ జానర్ జోలికి వెళ్ళలేదు. కానీ మాస్ ప్రేక్షకులకు బాగా చేరువ చేసింది మాత్రం అవే. మళ్ళి ఆ తరహా పాత్రలో జూనియర్ ని చూడాలన్న కోరిక దీని రూపంలో నెరవేరబోతోంది. సెకండ్ హాఫ్ లో పూర్తిగా గేర్ మార్చి వీర రాఘవగా తారక్ విశ్వరూపం ఇందులో చూడవచ్చని ఇన్ సైడ్ టాక్. దానికోసం చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ తనదైన మార్క్ తో రాసాడట త్రివిక్రమ్. నాగ బాబు-జగపతి బాబు హీరో హీరోయిన్లకు తండ్రులుగా నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ పూజా హెగ్డే. దసరాని టార్గెట్ పెట్టుకున్న అరవింద సమేత వీర రాఘవ ఇప్పుడున్న స్పీడ్ కొనసాగిస్తే రావడం పెద్ద విషయం కాదు. సిక్స్ ప్యాక్ కూడా పాత్ర డిమాండ్ మేరకే పెంచిన తారక్ దానితో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేసాడో చూసేందుకు ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదుర్స్ తర్వాత రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్న అరవింద వీర సమేత ఇప్పుడే ఇన్ని అంచనాలు మోస్తోంది అంటే విడుదల దగ్గర పడే టైంలో ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.