Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీకి 17యేళ్లు!!
By: Tupaki Desk | 9 July 2020 7:30 AM GMTదర్శకధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ (రౌద్రంరణంరుధిరం) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో ఈ సినిమా జక్కన్న తెరకెక్కిస్తున్నారు. అయినా జక్కన్న నక్కతోక తొక్కినట్లుగా అన్నీ సినిమాలు హిట్ అవుతున్నాయి. మరి రాజమౌళి సినీ ప్రస్థానం ఎక్కడ మొదలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో మెగాఫోన్ పట్టుకొని దర్శకుడిగా పరిచయం అయ్యారు. తన ప్రతి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే రాజమౌళి.. ఎన్టీఆర్ తో ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్1 చేసేటప్పుడు ఎన్టీఆర్ కి 19 ఏళ్లు. చాలా లావుగా ఉండేవాడు. సరిగ్గా మీసాలు కూడా రాలేదు. ఎలాంటి పర్సనల్ మెయిన్‌టైనింగ్ లేదు. అప్పుడు నాకేంటి మొదటి సినిమాకి ఇలాంటి హీరో దొరికాడని చాలా ఫీల్ అయ్యానని తెలిపాడు రాజమౌళి. అయితే అది మొదటి సినిమానేగా అనుకుని సినిమాను పట్టాలెక్కించారు. కానీ, సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు ఇంటెర్వెల్ సీన్స్‌లో ఎన్టీఆర్ డైలాగ్స్ చెబుతున్నప్పుడు.. ఇతను ఖచ్చితంగా పెద్ద స్టార్ అవుతాడని..
అతని లోపల ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉందనుకున్నాని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఆ తర్వాత రెండోసారి సింహాద్రి తీసి భారీ హిట్ అందుకున్నాడు. నిజానికి బాలయ్య రాజమౌళి కలిసి 17 ఏళ్ల కిందే సినిమా చేయాల్సి ఉందట. కానీ అనుకోకుండా మిస్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన సింహాద్రి సినిమా కోసం ముందు బాలయ్యనే అనుకున్నాడట రాజమౌళి. అయితే ఆ సమయంలో అలాంటి ఫ్యాక్షన్ కథలు చాలానే చేయడంతో సింహాద్రి వైపు ఆసక్తి చూపించలేదట బాలయ్య. అలా ఎన్టీఆర్‌కు ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా 2003 జులై 9న విడుదలైంది. నేటికీ సినిమా విడుదలై 17సంవత్సరాలు పూర్తి చేసుకుంది.