Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ కోసం ఎన్టీఆర్ పాట?

By:  Tupaki Desk   |   19 Dec 2015 1:00 PM IST
పవర్ స్టార్ కోసం ఎన్టీఆర్ పాట?
X
అవును.. జూనియర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ కోసం పాట పాడుతున్నాడు. ఛ ఊర్కోండి ఏంటీ జోకులు అంటారా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ముమ్మాటికీ నిజం అంటున్నారు ఎన్టీఆర్ సన్నిహితులు. ఐతే చిన్న మెలిక ఏంటంటే.. ఇక్కడ పవర్ స్టార్ అంటోంది పవన్ కళ్యాణ్ ను మాత్రం కాదు. అది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. ఈ కన్నడ స్టార్ హీరో కోసం ఎన్టీఆర్ గొంతు సవరించుకోబోతున్నాడట. ఎన్టీఆర్‌ తో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ పునీతే తన తర్వాతి సినిమాలో ఓ పాట పాడాలని అడిగాడట. ముందు కాదు అన్నా.. బలవంతం చేసేసరికి ఒప్పేసుకున్నాడట యంగ్ టైగర్.

ఎన్టీఆర్ పాటలు పాడటం ఇది కొత్తేం కాదు. పదేళ్ల కిందట ‘యమదొంగ’లో ఓలమ్మీ తిక్క రేగిందా అంటూ తొలిసారి పాట అందుకున్న జూనియర్.. తర్వాత ‘కంత్రి’లో టైటిల్ సాంగ్‌ తో పాటు ‘రభస’ మూవీలో రాకాసి రాకాసి అంటూ ఓ ఊపు ఊపేశాడు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రాబోతున్న ‘నాన్నకు ప్రేమతో’లో కూడా ఎన్టీఆర్ ఓ పాట పాడతాడని ప్రచారం జరుగుతోంది. ‘నాన్నకు ప్రేమతో’ పనంతా పూర్తయ్యాక పునీత్ సినిమా కోసం త్వరలోనే ఎన్టీఆర్ బెంగళూరు వెళ్లి పాట రికార్డ్ చేసి వస్తాడని సమాచారం.