Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం ఆ హోటల్ సెట్ చేశారు

By:  Tupaki Desk   |   23 Dec 2015 11:30 AM GMT
ఎన్టీఆర్ కోసం ఆ హోటల్ సెట్ చేశారు
X
ఎన్టీఆర్ ఏంటి.. పునీత్ రాజ్ కుమార్ కోసం పాట పాడ్డమేంటి.. ఇదేదో రూమర్ అయి ఉంటుందని కొట్టి పారేశారు జనాలు. కానీ ఇప్పుడా సంగతే నిజమని తేలింది. కన్నడ అభిమానులు పవర్ స్టార్ అని పిలుచుకునే పునీత్ కోసం ఎన్టీఆర్ గొంతు సవరించుకోబోతుండటంపై అఫీషియల్ సమాచారమూ వచ్చేసింది. ఈ పాటను కంపోజ్ చేయబోతున్న తమనే స్వయంగా ఈ విషయాన్ని ఖరారు చేశాడు. ఈ గురువారమే ఎన్టీఆర్ ఆ పాట పాడబోతున్నట్లు కూడా వెల్లడించాడు తమన్.

ఐతే కన్నడ పాట కదా.. దాన్ని పాడ్డానికి ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్తాడేమో అనుకున్నారు జనాలు. కానీ ఈ పాట రికార్డింగ్ హైదరాబాద్ లోనే జరగబోతోంది. పార్క్ హయత్ హోటల్లో ఈ పాటను రికార్డ్ చేయబోతున్నారట. ఎన్టీఆర్ తో పాడించడం కోసం ఓ ర్యాప్ ట్యూన్ రెడీ చేశాడట తమన్. రిహార్సల్స్ అవీ చేసుకుని ఒక్క రోజులోనే రికార్డింగ్ పూర్తి చేస్తారట. తమన్ సంగీత దర్శకత్వంలో ఎన్టీఆర్ పాట పాడటం ఇది తొలిసారేమీ కాదు. ‘రభస’ సినిమాలో రాకాసి రాకాసి అంటూ ఎన్టీఆర్ పాడిన పాట సూపర్ హిట్టయింది. అంతకుముందు కూడా వేరే సినిమాల్లో ఎన్టీఆర్ గొంతు సవరించుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటిదాకా తన కోసం తాను పాడుకున్న ఎన్టీఆర్.. ఈసారి మాత్రం వేరే హీరో, అది కూడా వేరే ఇండస్ట్రీకి చెందిన వాడికి గొంతు అరువిస్తుండటం విశేషమే.