Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ 25 కోసం పాడేసిన ఎన్టీఆర్
By: Tupaki Desk | 23 Dec 2015 7:28 PM GMTఅనుకున్నట్లే ఒక్కరోజులోనే తన సింగింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మనోడు ఎప్పటిలాగానే సింపుల్ గా చెప్పగానే ఒక్క టేక్ లో నేర్చేసుకుని.. రెండో టేక్ లో పాడేశాడట తారక్. గతంలో రాకాసి రాకాసి.. ఓలమ్మీ తిక్కరేగిందా.. వంటి పాటలను సునాయసంగానే పాడిన ఎన్టీఆర్.. తనకు రభస, రామయ్య వస్తావయ్య, బాద్షా వంటి సినిమాలకు సంగీతం అందించిన తమన్ కోసం ఇప్పుడు తొలిసారిగా తనకు కాకుండా వేరే హీరోకు ఇలా పాట పాడేశాడు.
అయితే ఎన్టీఆర్, తమన్ లు కలసి ఈ పాట రికార్డింగ్ ను పూర్తి చేసేస్తారనుకుంటే.. ఏకంగా పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఈ రికార్డింగ్ కోసం విచ్చేశాడు.. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్.. ''నా 25వ సినిమా (నాన్నకు ప్రేమతో) చేస్తున్న సమయంలోనే పునీత్ సార్ 25వ సినిమా చక్రవ్యూహ కోసం పాట పాడటం ఎంతో ఆనందంగా ఉంది'' అంటూ చెప్పుకొచ్చా డు. ఈ సందర్భంగా పవర్ స్టార్ తో ఒక సెల్ఫీ కూడా దిగిన ఎన్టీఆర్.. దానిని అభిమానులకు షేర్ చేసి ఖుషీ చేశాడు కూడా.
ఇకపోతే ఎన్టీఆర్ పాడింది కన్నడ సినిమాలో సాంగ్. మరి ఈ పాట కన్నడలో ఉంటుందా అంటే.. మాత్రం తెలియదు. పాట కన్నడలో ఉందో.. లేకపోతే కొలవెరి డి టైపులో ఇంగ్లీషులో ఉంది తమన్ బాబే చెప్పాలి. గతంలో ఎన్టీఆర్ కోసం తమిళ స్టార్ శింబు మాత్రం.. యు ఆర్ మై డైమండ్ గాళ్ అంటూ.. ఆంగ్లం ప్లస్ తెలుగు రీమిక్స్ లో పాడేశాడు. ఎన్టీఆర్ కూడా అలాగే పాడేశాడేమో.