Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ కి అంత షాక్ ఇచ్చాడా?

By:  Tupaki Desk   |   7 July 2016 5:09 AM GMT
కళ్యాణ్ రామ్ కి అంత షాక్ ఇచ్చాడా?
X
నందమూరి హీరోల్లో సయోధ్య తగ్గిందనే కామెంట్స్ కు ఇప్పుడు చెక్ పెట్టేయచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ ల మధ్య చక్కని అవగాహన కుదిరింది. ఒకరికొకరు అన్నట్లుగా వీరి రిలేషన్ మరింత ధృడం అవుతోంది. ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేయడంలో కూడా ఏమాత్రం సంశయించడం లేదు ఈ నందమూరి హీరోలు. రీసెంట్ గా జరిగిన కళ్యాణ్ రామ్ బర్త్ డే ఇందుకు వేదికగా నిలిచింది.

కళ్యాణ్ రామ్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ ఓ పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. తన బ్రదర్ కోసం ఎన్టీఆర్ ఇలాంటి పార్టీ ఇవ్వడం ఇదే మొదటిసారి అంటున్నారు. అంతే కాదు.. ఈ పార్టీకి ఫ్యామిలీ- ఫ్రెండ్స్ తో పాటు సన్నిహితులను కూడా ఆహ్వానించాడు ఎన్టీఆర్. వీరితో పాటే జనతా గ్యారేజ్ యూనిట్ అంతా కూడా ఈ పార్టీకి అటెండ్ కావడం విశేషం. ఇక కళ్యాణ్ రామ్ తో ఇజం మూవీ చేస్తున్న పూరీ జగన్నాథ్ అండ్ టీం కూడా ఈ పార్టీలో కనిపించారు. తమ్ముడి అభిమానం చూసి కళ్యాణ్‌ రామ్‌ షాకయ్యాడట.

మరోవైపు కళ్యాణ్ రామ్ చేస్తున్న ఇజం మూవీపై ఇప్పటికే ఇండస్ట్రీలో బజ్ ఏర్పడింది. మొదటిసారిగా స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తుండడం.. పూరీ స్టయిల్ హీరోగా కళ్యాణ్ రామ్ కనిపిస్తుండడంతో ఈ మూవీ రిజల్ట్ పై ఆసక్తి నెలకొంది. జర్నలిస్ట్ పాత్రలో ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కనిపిస్తుండగా.. ఆ పాత్ర పేరు బాలకృష్ణ కావడం విశేషం.