Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీ చల్లగా ఉండాలి .. కొత్త ఊపిరిపోయండి: ఎన్టీఆర్
By: Tupaki Desk | 30 July 2022 4:03 AM GMTఎన్టీఆర్ ముఖ్య అతిథిగా నిన్న రాత్రి హైదరాబాదులో 'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకి నటీనటులు .. సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో మంచి కోలాహలంగా ఈ ఫంక్షన్ జరిగింది. అభిమానుల చప్పట్లు .. కేరింతలు చూసి, ఎన్టీఆర్ .. కల్యాణ్ రామ్ ఒకానొక సమయంలో ఎమోషన్ కి లోనయ్యారు.
ఈ స్టేజ్ పై ఎన్టీఆర్ మాట్లాడుతూ .. " కల్యాణ్ రామ్ నాకు కాల్ చేసి ఈ కథను విన్నప్పుడు నిజంగా నేను భయపడ్డాను. ఎందుకంటే దర్శకుడికి పెద్దగా అనుభవం లేదు .. అతణ్ని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్టును అప్పగించడం ఎంతవరకూ కరెక్ట్ అనుకున్నాను.
కానీ ఈ సినిమా చూసిన తరువాత దర్శకుడి విషయంలో నాకున్న టెన్షన్ ఎగిరిపోయింది. ఇప్పుడే అతను ఇలాంటి ఒక ప్రయోగం చేశాడంటే. మున్ముందు మరెన్నో ప్రయోగాలు చేయగలడనే విషయం నాకు అర్థమైంది. ఈ సినిమాను నేను చూశాను .. అందువల్లనే ఈ మాటను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. ఇక కల్యాణ్ రామ్ విషయానికి వస్తే అతను ఎంతగా కష్టపడతాడనేది మీకు తెలియదు. నేను అతణ్ణి చాలా దగ్గరగా చూస్తూ ఉంటాను గనుక నాకు తెలుసు. ఈ సినిమా అతణ్ణి నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
కల్యాణ్ రామ్ తన కెరియర్లో వెనుదిరిగి చూసుకుంటే, 'బింబిసార' సినిమాకి ముందు .. తరువాత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాత్రను ఆయన తప్ప వేరెవరూ చేయలేరు. ఇప్పుడు ఇండస్ట్రీ చాలా గడ్డుకాలంలో ఉందని అంటున్నారు .. థియేటర్లకు జనాలు రావడం లేదని అంటున్నారు .. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన సినిమా వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప హృదయాన్ని కలిగిన తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరూ. తెలుగు ఇండస్ట్రీ చల్లగా ఉండాలి .. దానికి మీరంతా కొత్త ఊపిరి పోయాలని నేను కోరుకుంటున్నాను .
కల్యాణ్ రామ్ కీ గానీ .. నాకు గాని ఆస్తిపాస్తులు అవసరం లేదు .. మీ అందరి అభిమానం ఉంటే చాలు. మా తాతగారు .. మా నాన్నగారు మాకు వదిలి వెళ్లిన ఆస్తి మీరే. అందువలన మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించాడు.
ఈ వేదికపై ఎన్టీఆర్ తన 30వ సినిమాను గురించి ఏవైనా మాట్లాడతాడేమోనని అభిమానులు చాలా ఆసక్తితో ఎదురుచూశారు. కానీ ఆయన కొరటాలతో చేయనున్న తన ప్రాజెక్టును గురించి ఏమీ ప్రస్తావించలేదు. ఆ విషయం కాస్త నిరాశను కలిగించినా, చాలా కాలం తరువాత మళ్లీ ఎన్టీఆర్ ను ఈ ఈవెంట్ లో చూసినందుకు హ్యాపీగా ఫీలయ్యారు.