Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ స్పీచ్ ను ఎందుకు మార్చారు?
By: Tupaki Desk | 28 Jun 2016 7:50 AM GMT'గౌరవం' ఇవ్వాలి అనే కారణంతో.. జూ.ఎన్టీఆర్ స్పీచ్ ను కాస్త మార్చేసింది మా టివి. దీనితో అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కే కోపమొస్తోంది. ఒకసారి ఒరిజినల్ స్పీచ్ బయటకు వచ్చాక.. ఇప్పుడు దానిని ఆల్టర్ చేసి టెలీక్యాస్ట్ చేస్తే.. దాని కారణంగా అనవసరమైన ఆరోపణల ప్రత్యారోపణల పర్వం మొదలైంది ఇప్పుడు.
సిని'మా' అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న జూ.ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరు, కింగ్ నాగార్జున చేతుల మీదుగా అవార్డు ట్రోఫీ తీసుకున్న తరువాత.. ఏమన్నాడంటే.. ''ఎప్పుడూ కూడా.. ఎన్నేల్ళు వచ్చినా కూడా.. మేమందరం ఎన్నేళ్ళు ఇక్కడున్నా కూడా.. మా అందరికీ ఇన్సిపిరేషన్.. చిరంజీవి గారు.. బాలకృష్ణ గారు.. నందమూరి తారకరామారావు గారు.. అక్కినేని నాగేశ్వరరావు గారు.. కృష్ణ గారు.. ఎప్పుడూ వాళ్ల యొక్క ఆశీర్వచనాలు మా జనరేషన్ పై ఉంటాయి'' అంటూ చెప్పాడు. ఆ రోజు కార్యక్రమం జరిగినప్పుడు ఈ స్పీచ్ ను వీడియోగా చిత్రీకరించి.. స్వయంగా ఎన్టీఆర్ అభిమానులే సోషల్ సైట్లలో పెట్టారు. అయితే ఇప్పుడు అసలు ట్విస్టు ఇక్కడే వచ్చింది.
మొన్న ఆదివారం సిని'మా' అవార్డుల కార్యక్రమం టివిలో ప్రచారమైనప్పుడు.. ఎన్టీఆర్ స్పీచ్ ను కాస్త మార్చి.. నందమూరి తారకరామారావు గారు.. అక్కినేని నాగేశ్వరరావు గారు.. కృష్ణ గారు.. అనే పదాలను ముందుకు మార్చి.. ఆ తరువాత చిరంజీవి, బాలయ్య, నాగ్ పేర్లను యాడ్ చేశారు. అసలు ఈ గిమ్మిక్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆనాటి స్పీచ్ ను షేర్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ గిమ్మిక్ చూసి షాకయ్యారు. ఎవరన్నా కావాలనే ఇలా స్పీచులో మార్పులు చేశారా? లేకపోతే ముందు చిరంజీవి పేరు చెబితే అభిమానులు ఫీలవుతారని స్వయంగా మా టివి యాజమాన్యం అలా డెసిషన్ తీసుకుందా?
https://twitter.com/ShekarNews/status/747121459672145920/video/1