Begin typing your search above and press return to search.

పిల్లల కోసమే ఈ సినిమా -ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   4 Sep 2017 3:57 AM GMT
పిల్లల కోసమే ఈ సినిమా -ఎన్టీఆర్
X
నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న జై లవకుశ ఆడియో రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రిభయనం చేస్తున్న ఈ సినిమాపై బజ్ మామూలుగా లేదు. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న జైలవకుశ ఆడియో రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ స్పీచ్ అందరినీ కట్టిపడేసింది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని... నాన్న హరికృష్ణకు అన్నదమ్ములం కలిసి ఇస్తున్న కానుక ఇది. మా అమ్మలు -నాన్న సగర్వంగా చెప్పుకొనే చిత్రం అవుతుందని ఎన్టీఆర్ సభావేదికపై చెప్పుకొచ్చాడు.

‘‘జనతా గ్యారేజ్ తర్వాత ఏ సినిమా చేయాలన్న దానిపై చాలా సందిగ్ధంలో పడిపోయాను. మనసుకు నచ్చింది చేయాలా.. ట్రెండ్ ను ఫాలో అవుతూ వెళ్లాలా అన్నదానిపై కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ బాబీ వచ్చి ఈ కథ చెప్పాడు. విన్న వెంటనే డిసైడయ్యాను. రేపటి రోజున మా అన్నదమ్ముల పిల్లలు ఏదైనా సినిమా చూడాలని అనుకున్నప్పుడు మేమిద్దరం కలిసి చేసిన సినిమా ఇదని వాళ్లు ఆనందంగా చెప్పుకోవాలి. జైలవకుశ సినిమా తీసిన ముఖ్య ఉద్దేశం ఇదే అన్నదమ్ముల అనుబంధం గురించి తెలియజేసే చిత్రం అన్నదమ్మలమైన మేమిద్దరం కలిసే చేసే అవకాశం దొరకడం నిజంగా అదృష్ణం. నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైన స్క్రిప్ట్ ఇచ్చిన బాబీకి ఈ విషయంలో థ్యాంక్స్.’’ అన్నాడు ఎన్టీఆర్.

ఆ విధంగా 'జయ లవ కుశ' సినిమాలో ఉన్న కంటెంట్ ఎలా ఉండబోతుందో చెప్పేశాడు ఎన్టీఆర్. ఇక ఇతరుల గురించి చెబుతూ.. ‘'సినిమాలో క్వాలిటీ అండ్ క్వాంటిటీ పర్ ఫెక్ట్ గా బ్లెండ్ చేయగలిగిన సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఛోటన్నా అని అభిమానంతో పిలుస్తుంటా. ఈ సినిమాకు ఆయన ఓ ఎస్సెట్. సినిమా చూశాక ఇందులో హీరోయిన్లుగా రాశీ ఖన్నా - నివేదా థామస్ కు బదులు ఇంకెవరైనా నటించి ఉంటే బాగుండి ఉంటుందేమో అన్న ఆలోచనే రాదు. వాళ్లు ఈ సినిమాలో తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్లు ఈ విషయంలో పర్ ఫెక్ట్’’ అని చెప్పాడు.

అలాగే దేవిశ్రీప్రసాద్ ను కూడా ఆకాశానికి ఎత్తేశాడు. ‘‘అసలు ఈ రోజు కార్యక్రమం మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ది. ఈ రోజే కాదు.. ఏ రోజైనా అతడిదే. దేహాలు వేరైనా ఆత్మలు ఒకటే అనేంత ఫ్రెండ్ షిప్ మాది. అతడితో నా పరిచయం దేవిశ్రీ కలుసుకోవాలని సినిమా టైం చేస్తున్న టైంలో ప్రారంభమైంది. మొదటి సారి ఎంత ఎనర్జిటిక్ గా చూశానో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అతడు సాధించిన విజయాలను కొంచెం ఈగో ఫీలయి ఉన్నా మా ఇన్ని ఏళ్ల అనుబంధం పేకమేడలా కూలిపోయి ఉండేది. ఎప్పుడైనా నేనొక్క పాట వేరొకటి కావాలని అడిగితే లేదన్నది లేదు. అందుకే కేవలం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు. అతడు బ్రదర్, ఫ్యామిలీ... అండ్ అమేజింగ్ ఫ్రెండ్. మా ఇద్దరి ఫ్రెండ్ షిప్ గురించి మాటలక్కర్లేదు. ఈ సినిమా పాటలు చాలు''

లిరిక్ రైటర్స్ గురించి చెబుతూ.. '‘పాటల రచయిత చంద్రబోస్ తో నా ప్రయాణం స్టూడెంట్ నెం. 1 నుంచి ప్రారంభమై ఇప్పుడు జై లవకుశ వరకు వచ్చింది. జనతా గ్యారేజ్ లో రామజోగయ్య శాస్త్రి రాసిన ప్రణామం పాట నా గుండెలకు బాగా దగ్గరగా ఉండేపాట. జైలవకుశ లోనూ వారి పాటలు ఆకట్టుకుంటాయి'' అన్నాడు ఎన్టీఆర్.