Begin typing your search above and press return to search.
ఈ జన్మ అభిమానులకే -జూ ఎన్టీఆర్
By: Tupaki Desk | 11 Sep 2017 7:44 AM GMTటాలీవుడ్ లో ఎంతో మంది హీరోస్ ఉన్నారు. అలాగే ఎవరి స్టామినకి తగ్గట్టుగా వారికి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. అభిమాన హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. ఇక కొంతమంది హీరోలు కూడా ఫ్యాన్స్ ప్రేమకు ఫిదా అయిపోయి వారిని మెప్పించాలని శ్రద్ధగా సినిమాలు తీస్తుంటారు. సినిమా షూటింగ్ అయిపోతే ఫ్యాన్స్ కోసం వారు చేసే వేడుకలు అన్ని ఇన్ని కావు. తమ అభిమాన హీరో ఏం చెబుతాడో అని ఫ్యాన్స్ కూడా ఎంతో ప్రేమగా వేడుకలకు హాజరువుతుంటారు.
ఇక వేడుకలలో అరుపులు చూసిన హీరోలు ఒక్కోసారి వారి అభిమానానికి భావోద్వేగానికి లోనై మాట్లాడుతూ.. అభిమానులను మరింత దగ్గర చేసుకుంటారు. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా "జై లవకుశ" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ ఆయన అభిమానులకి ఎంతో ఆనందాన్నిచ్చింది. వేడుకలో భాగంగా ఎన్టీఆర్ ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ అన్న ఒక్క మాట ప్రతి ఒక్కరినీ హార్ట్ ను టచ్ చేసింది. తారక్ తండ్రిని చూస్తూ ఏమన్నారెంటే.. ''నాన్న ఈ జన్మకి అభిమానులతోనే ఉండిపోతాను" అని చెప్పిన ఒక్క మాటకి వేదిక దద్దరిల్లింది. ఆ ఒక్క మాటతో ఎన్టీఆర్ అభిమానులపై తనకున్న ప్రేమను చెప్పేశాడు.
సినిమా గురించి కూడా ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. సినిమా కథ వినగానే ఇద్దరు ప్రముఖ ఆప్తులకు ఈ కథను చెప్పానని వారు చాలా బావుందని ప్రశంసించారని తెలిపాడు. అయితే వారి పేరును సినిమా సక్సెస్ అయిన తర్వాత చెబుతానని ఎన్టీఆర్ వివరించాడు. జై లవకుశ సినిమా తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. అలాగే గర్వంగా తల ఎత్తుకునేల ఉంటుందని చెబుతూ..ఇది ఒక అన్నదమ్ముల చిత్రం అవుతుందని కూడా ఎన్టీఆర్ తెలిపాడు. ఇక ఫైనల్ గా తారక్ అభిమానుల కోరిక మేరకు రావణ డైలాగ్ ని చెప్పి అభిమానులతో విజిల్స్ వేయించాడు.