Begin typing your search above and press return to search.
కింద పడితేనే విలువ తెలుస్తుంది -ఎన్టీఆర్
By: Tupaki Desk | 13 Aug 2016 4:02 AM GMTజనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఒకవైపు జనతా గ్యారేజ్ ని ఎంత గొప్పగా ఉంటుందో చెబుతూనే.. మరోవైపు గతంలో ఫ్లాపులు ఎదురైనపుడు తాను ఎదుర్కున్న పరిస్థితులను కూడా వివరించేందుకు ప్రయత్నించాడు.
అభిమానుల కోలాహలం మధ్య మాట్లాడ్డం మొదలుపెట్టిన ఎన్టీఆర్... " ప్రతీ సారీ మీ రుణం తీర్చుకోవచ్చని అనుకుంటాను. అది ఎప్పటికీ జరగదేమో.. అది జరక్కుండానే వెళ్లిపోయి మీ రుణం తీర్చుకోవడానికి మళ్లీ పుడతానేమో! ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో.. ఈ జన్మలో ఆ మహానుభావుడికి మనవడిగా పుట్టడం జరిగింది. ఓ అద్భుతమైన తల్లిదండ్రలకు పుట్టాను. మీలాంటి అన్నలకు తమ్ముడిగా.. మీ లాంటి తమ్ముళ్లకి అన్నగా పుట్టాను" అంటూ ఆనందాన్ని పంచుకున్న జూనియర్.. తర్వాతే అసలు విషయంలోకి వచ్చాడు.
"చాలా మాట్లాడదాం అనుకున్నాను. మనసు విప్పి మాట్లాడదాం అని ఉంది. అలా చెబితే నన్ను నేను తగ్గించుకోవడానికి మాట్లాడినట్లుగా ఉంటుందేమో. అయినా నిజం మాట్లాడితే తగ్గించుకోవడం కాదు. మొదట నిన్ను చూడాలని చేసినప్పుడు ఎక్కడి కెళ్తున్నానో ఏమవుతున్నానో అర్ధం కాలేదు. ఆది.. సింహాద్రి వచ్చాయి. అంతా ఇంతే అనుకున్నాను. ఏమీ అర్ధం కాలేదు.. చిన్న వయసులో తెలీలేదు. కిందకు పడిపోతేనే తెలుస్తుంది. దేవుడి కంటే గొప్పోళ్లం అయిపోలేం కదా. చాలా సినిమాలు చేసినా.. నా మీద ప్రేమతో నా మీద అభిమానంతో ఆశతో మీరు బాధపడ్డం చూశాను. నాలో నేను బాధ పడ్డాను. నాలో నేను కుమిలిపోయాను. అలాంటి సమయంలో వక్కంతం వంశీ ఓ కథ చెప్పాడు. ఆ సినిమా పేరే టెంపర్. పూరీ లాంటి డైరెక్టర్ చేద్దాం అని ఒప్పించడంతో మీకు దగ్గరయ్యాను. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో. చాలామంది నేను ఈ గెడ్డం పెంచినపుడు ఎలా రిసీవ్ చేసుకుంటారని అన్నారు. అది సక్సెస్ అయ్యాక.. ఆ గమ్యం ఇంకా దగ్గరైంది. ఆ తర్వాత ఇప్పుడు అర్ధమైంది.. ఆ లైట్ జనతా గ్యారేజ్" అంటూ తన ఉద్వేగాన్ని కూడా పంచుకున్నాడు యంగ్ టైగర్.
"రెండు సంవత్సరాల క్రితం నాకు చెప్పిన కథ చెప్పిన కథ జనతా గ్యారేజ్ శివగారిది. సారీ.. గారు అనను.. శివ అంతే. ఏదో చేయాలి కాబట్టి చేయడమే మీకోసం. ఫ్లాప్ సినిమాల్లో బిజీగా ఉండి శివ చెప్పిన కథ జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ ని రివర్స్ చేస్తే.. ఆర్ ఫర్ రభస.. టీ ఫర్ టెంపర్.. జె ఫర్ జనతా గ్యారేజ్ అని ఓ అభిమాని చెప్పడం చూశా. ఇది కో ఇన్సిడెంటల్ గా జరిగిందే. ఇక మోహన్ లాల్ లాంటి అద్భుతమైన గొప్ప మనిషి.. గొప్ప నటుడి పక్కన నుంచునే అవకాశం ఇచ్చాడు కొరటాల శివ" అంటూ జనతా గ్యారేజ్ చేయడంపై తన సంతోషాన్ని కూడా పంచుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.