Begin typing your search above and press return to search.

మగాళ్లుగా ఎందుకు పుట్టాం అనుకుంటారు -ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   1 May 2018 6:21 PM GMT
మగాళ్లుగా ఎందుకు పుట్టాం అనుకుంటారు -ఎన్టీఆర్
X
మహానటి చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వచ్చాడు. నిజానికి ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో.. యంగ్ టైగర్ నటిస్తాడనే ప్రచారం జరిగింది కానీ అది సాధ్యం కాలేదు. అలా ఎందుకు చేయలేదనే డౌట్ కు సమాధానం ఇవ్వడమే కాకుండా.. సావిత్రి ఘనత గురించి అత్యద్భుతంగా చెప్పాడు జూనియర్.

"అసలు ఈ ఆడియో ఫంక్షన్ లో ఈ స్టేజ్ పై సావిత్రి గారి హుందా గురించి.. ఆవిడ గొప్పతనం గురించి మాట్లాడే అర్హత.. ఇప్పుడే కాదు.. బహుశా ఎన్ని జన్మలు ఎత్తినా సరే రాదేమో.. ఆమె ఒక నిజమైన లేడీ సూపర్ స్టార్.. మహానటి సావిత్రి గారి గురించి మాట్లాడేందుకు.. నేను మాటలకోసం వెతుక్కోవాల్సి వస్తోంది. ఆవిడ పేరు తలిచే అర్హత కూడా మాకు లేదని అనిపిస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేయాలో.. ఎక్కడ ఆపాలోకూడా తెలియని పరిస్థితి నాది. ఆవిడ ఎలా పోయారు అనే కంటే.. ఎలా బ్రతికారు అని చెప్పే గొప్ప చిత్రం మహానటి" అన్నాడు యంగ్ టైగర్.

"కొంత మంది జీవితం పంచుకోవడం మనకు చాలా అవసరం. కొంతమంది విజయాలను ఆదర్శంగా పొందడం అవసరం. కొందరి జీవితం మనకు చాలా అవసరం. ఒక అద్భుతమైన వ్యక్తి జీవితాన్ని మన కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. ఈ సినిమా తీయడంలో.. నాగ్ అశ్విన్ కు సావిత్రి గారంటే ఎంత ఇష్టం గౌరవం ఉన్నాయనే సంగతి అర్ధం అవుతుంది. ఈ చిత్రాన్ని తను ఒక దర్శకుడిగా కాకుండా. అభిమానిగా తీశాడని అనుకుంటున్నాను. తనకు అండగా.. ప్రియాంక.. స్వప్న ఉండడం అభినందించాలి. వాళ్లను కన్న అశ్వినీ దత్తుగారు అండగా ఉన్నారు" అన్నాడు ఎన్టీఆర్.

"ఒక గొప్ప విషయాన్ని తెరకు ఎక్కించబోతున్నపుడు.. మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. కొందరు దేవుడు అంటారు. నేను ప్రకృతి అంటాను. ప్రకృతి అంటే దేవుడే. ఆ ప్రకృతే.. కీర్తి సురేష్ ను మహానటి పాత్రలోకి తెచ్చింది. అదే నేచర్ దుల్కర్ ను తీసుకొచ్చింది. విజయ్ ను తీసుకొచ్చింది. సమంతను తెచ్చింది.. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ టెక్నీషియన్ ను తెచ్చింది. పెద్దవాళ్లు.. గొప్పవాళ్లు భౌతికంగా మనల్ని వదిలేసి వెళ్లినా.. వారి గొప్పదనం మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ టీంను చూస్తుంటే సావిత్రి గారే వీరందరినీ ఎంచుకున్నట్లుగా ఉంది" అన్నాడు జూనియర్.

"స్వప్న ఓ రోజు నా దగ్గరకు వచ్చింది. అప్పుడు అసలు విషయం నాకు అర్ధమైంది. నేను నో అన్నాను.. ఆమె నవ్వుతోంది. ఈ చిత్రంలో తాతగారి పాత్రలో ఒక చిన్న క్యామియో చేయాలని కోరింది. ఆయన పాత్రను నేను పోషించడం అనేది కరెక్ట్ కాదని. నాకు అంత అర్హత లేదని చెప్పాను. నాకు అంత దమ్ము లేదు. ఎలాంటి భయం లేకుండా చేసినందుకు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చేసిన హ్యాట్సాఫ్ టు దుల్కర్.. ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా.. వెంటనే ఒప్పుకుని.. ఆ కష్టాన్ని మన ముందుకు తెచ్చారు ఈ టీం" అన్నాడు యంగ్ టైగర్.

"తెలిసిన వ్యక్తి గురించి మన ముందు చూపించడం.. అంటే నటించడం కాదు.. జీవించాల్సిందే. సీతారామశాస్త్రి గురించి మాట్లాడేంత అర్హత వయసు రెండూ నాకు లేవు. మిక్కీ అద్భుతమైన సంగీతం అందించాడు. వైజయంతీ మూవీస్ నాన్నగారితో మొదలైంది. స్వప్న సినిమా నా చిత్రం స్టూడెంట్ నెం. 1 తో మొదలైంది. తన పేరుపై పెట్టిన బ్యానర్.. ఈ రోజు ఇంత గొప్ప సినిమా తీశారు. అప్పుడు ఇంత గొప్ప స్థితికి ఈ బ్యానర్ చేరుతుందని నేను అనుకోలేదు. స్వప్నకు.. స్వీటికి బెస్ట్ విషెస్ చెబుతున్నాను. సినిమాకు పని చేసిన అందరికీ శుభాకాంక్షలు" అన్నాడు యంగ్ టైగర్.

"ఈ మధ్య ఆడవాళ్ల మీద అకృత్యాలు జరుగుతన్నాయి. ఒక్కసారి ఈ చిత్రం చూసిన తర్వాత.. ఎందుకు మనం మగాళ్లుగా పుట్టా అనుకోకపోతే చూడండి. ట్రూ లేడీ సూపర్ స్టార్. ఒక ఆడదాని బలం ఏంటో.. ఆడవాళ్లు తలచుకుంటే ఏం సాధించగలుగుతారు అనేందుకు.. ఈ చిత్రం చూసి ఆడవాళ్లను గౌరవిస్తారు అని కోరుకుంటున్నాను" అంటూ తన స్పీచ్ ముగించాడు జూనియర్ ఎన్టీఆర్.