Begin typing your search above and press return to search.

నేను చాలా చిన్న పిల్లాడిని - ఎన్టీఆర్‌

By:  Tupaki Desk   |   22 Jan 2016 4:08 PM GMT
నేను చాలా చిన్న పిల్లాడిని - ఎన్టీఆర్‌
X
ఓ సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అంతా హీరోకే ఇచ్చేయడం, దాన్ని బట్టే స్టార్ హీరోల రేంజ్ డిసైడ్ చేయడం తెలుగు సినీ ఇండస్ట్రీలో కామన్. అఫ్ కోర్స్.. ఫ్లాప్ అయితే ఆ తప్పు డైరెక్టర్ ది లెండి.. అది వేరే విషయం. కానీ ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన హీరో.. అందులో తన క్రెడిట్ ఏమీ లేదని చెప్పగలగడం మాత్రం చాలా అంటే చాలా పెద్ద విషయం.

సుకుమార్-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో ఏ రేంజ్ సక్సెస్ అవుతోందో చూస్తూనే ఉన్నాం. ఈ విజయం ఇచ్చిన ఆనందాన్ని పంచుకునేందుకు యూనిట్ అంతా కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన యంగ్ టైగర్, ఈ మూవీ సక్సెస్ అంతా ఆ నాలుగు పిల్లర్స్ దేనని తేల్చేశాడు. 'జగపతి బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సుకుమార్ గారు, నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ గారు.. ఈ నలుగురే నాన్నకు ప్రేమతో చిత్రానికి నాలుగు పిల్లర్స్ లాంటి వారు. నేను వారి ముందు చాలా చాలా చిన్న పిల్లాడిని' అనేశాడు జూనియర్.

'కలెక్షన్స్ కంటే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎక్కువ గౌరవాన్ని పొందింది' అని ఎన్టీఆర్ చెప్పడం హైలైట్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చి కూడా ఇంతగా ఒదిగి ఉన్న ఎన్టీఆర్ కి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అసలు ఈ మూవీలో చాలా కీలకమైన ఇంటర్వెల్ సన్నివేశానికి ముందు.. జగపతి బాబుని, తనను ఒకరితో ఒకరు రొమాన్స్ చేసుకోమని డైరెక్టర్ చెప్పాడంటూ.. ఎన్టీఆర్ చెప్పిన మాటలు నవ్వులు పూయించింది.