Begin typing your search above and press return to search.

బాబాయ్‌ లో పెద్దాయ‌న్ని చూశా!- ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   21 Dec 2018 5:35 PM GMT
బాబాయ్‌ లో పెద్దాయ‌న్ని చూశా!- ఎన్టీఆర్
X
బాబాయ్ ప‌క్క‌న‌ నిల‌బ‌డితే ఇన్నిరోజులు బాబాయ్‌ గానే అనిపించేది.. కానీ ఈ రోజున పెద్దాయ‌న గుర్తుకొస్తున్నారు. ఆ మ‌హా మ‌నిషి కుటుంబంలో నేను ఒక‌డిగా ఉన్నందుకు అదృష్ట‌వంతుడిని... అని అన్నారు ఎన్టీఆర్. నేటి సాయంత్రం జేఆర్‌ సీ సెంట‌ర్‌ లో `కథానాయ‌కుడు` ఆడియో ఈవెంట్ నంద‌మూరి హీరోల‌తో క‌ళ‌క‌ళ‌లాడింది. ముఖ్యంగా వేదిక‌పై బాబాయ్ బాల‌కృష్ణ‌తో అబ్బాయ్ లు వేదిక ను షేర్ చేసుకోవ‌డం అభిమానుల‌కు క‌న్నుల‌పండువ‌గా నిలిచింది.

ఇదే వేదిక‌పై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్పీచ్ ఎంతో ఎమోష‌న‌ల్ గా సాగింది. స్పీచ్ ఆద్యంతం తాత ఎన్టీఆర్ గురించి - బాబాయ్ బాల‌కృష్ణ గురించి తార‌క్ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యి మాట్లాడాడు. ఆ ఇద్ద‌రిపై ప్రేమాభిమానాల్ని కురిపించాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ -``ఒక మ‌హానుభావుడు చేసిన త్యాగాల వ‌ల్ల ల‌బ్ధి పొందిన ఒక తెలుగు వాడిగా మాట్లాడ‌డానికి వ‌చ్చాను. నేను చిన్న‌ప్పుడు తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ఆయ‌న్ని తాత‌య్య‌గారు అని సంభోధించాను. ఆయ‌న గురించి తెలిశాక రామారావు గారు అనో.. అన్న‌గారు అనో పిలిచాను.. తెలుగు వాడిగా పుట్టిన ప్ర‌తి ఒక్క‌రి కి చెందిన ఒక ధృవ‌తార విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ప‌ద్మ‌శ్రీ నంద‌మూరి తార‌క రామారావు.

నాన్న చెప్పిన‌ప్పుడు.. అమ్మ చెప్పిన‌ప్పుడు బాబాయ్ చెప్పిన‌ప్పుడు క‌థ‌లు విన్నాను. ఎంత విన్నా ఇంకా చ‌రిత్ర మిగిలే ఉంటుంది. వాల్మీకి మ‌హ‌ర్షి రామాయ‌ణం రాసేప్పుడు.. నిలువెత్తు ధ‌ర్మంగా రాముడిని చూపించారు. మ‌ళ్లీ అలాంటి వాడిని చూడ‌లేమా? అనుకుంటే తార‌క రాముడు వెల‌సారు. ``ప‌క్క రాష్ట్రంలోనూ తొడ‌గొట్టి తెలుగు వాళ్లు అంటే ఇదిరా.. తెలుగు వాడి పౌరుషం.. ఇదిరా తెలుగువాడి ఆత్మ‌గౌర‌వం ఇదీ అని తొడ‌గొట్టి స‌వాల్ విసిరారు తాత‌గారు. అలా ఛాలెంజ్ చేసిన వాళ్లు ఎంద‌రో ఉన్నా అందులో నంద‌మూరి తార‌క‌రారాము ప్ర‌ధ‌ముడు అని అన్నారు.

ఎన్టీఆర్ చిత్రం తెర‌కెక్కించిన బాబాయ్ గురించి ప్ర‌స్థావిస్తూ.. మా పిల్ల‌లు అడిగితే ఒక‌టి చెబుతాను. ``మా తాత గురించి మీ తాత చేసిన చిత్రం ఒక‌టుంద‌ని చెబుతాను`` అనీ వ్యాఖ్యానించారు తార‌క్‌. ఆ మ‌హానుభావుడి చ‌రిత్ర‌ను అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది బాబాయ్‌. మీ గురించి ఎంత‌ పొగిడినా స‌రిపోదు. భావిత‌రాల‌కు ఒక మహానుభావుడి చ‌రిత్ర‌ను అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది. ఆయ‌న ఎన్నో సినిమాలు చూశాను. బాబాయ్ లో తెర‌పై నేను పెద్దాయ‌న్నే చూసుకుంటున్నా అని ఎమోష‌న‌ల్ స్పీచ్ ని ఇచ్చారు తార‌క్.