Begin typing your search above and press return to search.
వేడుకలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్..? కారణమేంటో..?
By: Tupaki Desk | 23 Dec 2020 9:44 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత తిరిగి స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ లో తారక్ కూడా పాల్గొన్నాడు. చివరగా తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు. అయితే ఈ మధ్య టాలీవుడ్ లో జరిగిన పార్టీలలో కానీ నందమూరి ఫ్యామిలీలో జరిగిన వివాహ వేడుకలో గానీ ఎన్టీఆర్ కనిపించకపోవడం అభిమానులకు నిరాశకు గురి చేస్తోంది. అలానే అనేక అనుమానాలను కూడా కలిగిస్తోందని తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేశారు. దీనికి టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిరంజీవి - మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - ప్రభాస్ - రామ్ చరణ్ - నాగచైతన్య - విజయ్ దేవరకొండ వారు కనిపించిన ఈ పార్టీలో తారక్ కనిపించలేదు. దీనిపై అప్పుడు రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి. అలానే నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లిలో కూడా తారక్ కనిపోయించలేదు. ఈ వివాహానికి బాలకృష్ణ దంపతులతో పాటు మోక్షజ్ఞ కూడా హాజరయ్యారు. ఇక ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ సతీసమేతంగా విచ్చేసారు. అయితే ఇందులో ఎన్టీఆర్ కానీ భార్య లక్ష్మీ ప్రణతి గానీ కనిపించలేదు. దీంతో ఫంక్షన్స్ కి పార్టీలకు తారక్ దూరంగా ఉంటున్నారనే టాక్ నడుస్తోంది.
అలానే 'ఆర్.ఆర్.ఆర్' లో కొత్త గెటప్ ఏదైనా రివీల్ అవకుండా ఉండటానికి బయటకు రావడం లేదేమో అనేవారు కూడా లేకపోలేదు. ఇక ఎప్పటిలాగే తారక్ ని నందమూరి ఫ్యామిలీలోని ఇతర సభ్యులు దూరం పెడుతున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ వేడుకలకు అటెండ్ కాకపోవడానికి కారణాలు ఏంటో తెలియదు కానీ.. అందరూ ఒకచోట చేరి ఇలాంటి ఫంక్షన్స్ లో సందడి చేసే ఫోటోలలో తారక్ లేకపోవడం మాత్రం ఫ్యాన్స్ ని కాస్త డిజప్పాయింట్ కి గురి చేస్తోందని తెలుస్తోంది.