Begin typing your search above and press return to search.
ఒక ఫ్లాప్ త్రివిక్రమ్ ప్రతిభను తగ్గించలేదు: ఎన్టీఆర్
By: Tupaki Desk | 8 Oct 2018 12:42 PM GMT'అరవింద సమేత' కౌంట్ డౌన్ ఇప్పుడు 100 గంటలలోపే ఉంది. ఒకవైపు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంటే.. 'అరవింద సమేత' టీమ్ మాత్రం ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే భారీగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ తో పాటు త్రివిక్రమ్ కూడా ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యాడు.
ఇక ఇద్దరి కాంబినేషన్ లో ఇంటర్వ్యూ అంటే ఇక మీడియా ప్రతినిథులు కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. త్రివిక్రమ్ - తారక్ కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో త్రివిక్రమ్ ను "ఎన్టీఆర్ గారు వరస హిట్లతో జోరుమీద ఉన్నారని.. మరి మీరు 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్ తో వెనకబడి ఉన్నారని.. మరి ఈ సినిమా" అని అడిగితే ఆ ప్రశ్నకు త్రివిక్రమ్ కంటే ముందు తారక్ ఆన్సర్ ఇచ్చాడు. "నేను ఇలాంటివి నమ్మను. ఒక్క ఫ్లాప్ సినిమాతో త్రివిక్రమ్ స్థాయి లాంటి వ్యక్తుల ప్రతిభను నిర్ణయించలేము.. ఒక ఫెయిల్యూర్ త్రివిక్రమ్ గారి ప్రతిభను తగ్గిస్తుందని నేను అనుకోవడం లేదు. అలా అయితే నేను సక్సెస్ లో లేనపుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఏమనుకుంటారు?" అని తిరిగి ప్రశ్నించాడు. దీనికి కౌంటర్ గా ఆ మీడియా ప్రతినిథి "మీమీద ఈగ వాలనివ్వడం లేదు" అని త్రివిక్రమ్ ను ఉద్దేశించి అనడంతో ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు.
ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం చూస్తుంటే త్రివిక్రమ్ పై ఎన్టీఆర్ కు ఏ లెవెల్ లో కాన్ఫిడెన్స్ ఉందో మనకు అర్థం అవుతుంది. మరి గురూజీ కూడా ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ఒక మంచి హిట్ ను కానుకగా అందిస్తాడని కోరుకుందాం.