Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కోరిక‌ని ఎట్ట‌కేల‌కు తీర్చిన ట్రిపుల్ ఆర్ టీమ్

By:  Tupaki Desk   |   6 May 2022 2:14 PM GMT
ఫ్యాన్స్ కోరిక‌ని ఎట్ట‌కేల‌కు తీర్చిన ట్రిపుల్ ఆర్ టీమ్
X
పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన మూవీ ట్రిపుల్ ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ సినిమా అంద‌రి అంచ‌నాల‌కు అనుగునంగానే దేశ వ్యాప్తంగా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు సృష్టించింది. తొలి సారి స్టార్ హీరోలు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ కావ‌డంతో ఈ చిత్రం కోసం ఇటు మెగా అభిమానులు, అటు నంద‌మూరి ఫ్యాన్స్ ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు.

భారీ అంచ‌నాల మ‌ధ్య ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజయాన్ని సాధించి మ‌రోసారి తెలుగు సినిమా స‌త్తాని చాటింది. హిందీలో రూ. 238 కోట్ల‌కు పై చిలుకు వ‌సూలు చేసింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ.1127 కోట్లు సాధించి స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. అయితే బాహుబ‌లి టార్గెట్ ల‌క్ష్యంతో విడుద‌లైన ఈ మూవీ ఆ స్థాయిని అందుకోవ‌డంతో మాత్రం త‌డ‌బ‌డింది. దీనికి `కేజీఎఫ్ 2` ప్ర‌భంజ‌నం కూడా ఓ ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింది.

ఈ మూవీ వ‌సూళ్ల‌ని గండికొట్టింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మార్చి 25న ట్రిపుల్ ఆర్ విడుద‌లైతే ఏప్రిల్ 14న `కేజీఎఫ్ 2 విడుద‌లై తొలి రోజు నుంచి త‌న ప్ర‌భంజ‌నాన్ని చూపించ‌డం మొద‌లు పెట్టింది. ఇదిలా వుంటే ట్రిపుల్ ఆర్ కు సోల్ గా మారిన `కొమురం భీముడో` వీడియో సాంగ్ ని మేక‌ర్స్ శుక్ర‌వారం విడుద‌ల చేశారు. ఈ మూవీ నుంచి వారికో వీడియోని ప్రేక్ష‌కుల కోసం అందిస్తున్న చిత్ర బృందం తాజాగా ట్రిపుల్ ఆర్ కు ప్ర‌ధాన బ‌లంగా నిలిచిన `కొమురం భీముడో` వీడియో సాంగ్ ని విడుద‌ల చేసింది.

ఈ పాట‌లో ఎన్టీఆర్ ప‌లికించిన హావ భావాలు న‌భూతో న‌భ‌విష్య‌తి అనే స్థాయిలో వున్నాయి. ఒకే ఫ్రేమ్ లో అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ని ప‌లికించ‌డంతో ఎన్టీఆర్ న‌ట‌కు అభిమానులే కాకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ పాట‌కు ముగ్ధులైన ఆడియ‌న్స్ చిత్ర బృందాన్ని ఈ పాట విడుద‌ల చేయ‌మ‌ని గ‌త కొన్ని రోజులుగా కోరుతూనే వున్నారు. అయితే మేక‌ర్స్ మాత్రం అది రావాల్సిన స‌మ‌యానికే వ‌స్తుందంటూ చెబుతూ వ‌చ్చారు.

ఎట్ట‌కేల‌కు అభిమానుల కోరిక తీరుస్తూ స‌ర్ ప్రైజ్ చేశారు. ఎన్టీఆర్ అభిన‌యం, సుద్ధాల అశోక్ తేజ అందించిన సాహిత్యం, కీర‌వాణి సంగీతం, కాల‌భైర‌వ గానం వెర‌సి ఈ పాట‌ని ట్రిపుల్ ఆర్ కి సోల్ గా మార్చాయి. లిరిక‌ల్ వీడియోకే ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇక వీడియోని ఏ రేంజ్ లో ట్రెండ్ చేస్తారో చూడాలి. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం గానూ రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు గానూ న‌టించిన విష‌యం తెలిసిందే.