Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడో.. ఆ ఈవెంట్ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూపులు

By:  Tupaki Desk   |   25 July 2022 5:28 AM GMT
ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడో.. ఆ ఈవెంట్ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూపులు
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల అయ్యి.. ప్రమోషనల్ హంగామా పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతోంది. స్క్రిప్ట్‌ విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తున్న దర్శకుడు కొరటాల శివ మరియు ఎన్టీఆర్‌ లు త్వరలోనే సినిమా ను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్‌ తన ఫిజిక్ ను మార్చబోతున్నాడు అనే వార్తలు కొన్ని వారాల క్రితం వచ్చాయి. షూటింగ్‌ ప్రారంభం అయ్యే వరకు ఎన్టీఆర్‌ లుక్‌ రివీల్‌ అయ్యే అవకాశం లేదని అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా కళ్యాణ్ రామ్‌ బింబిసార సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ ను గత కొన్ని వారాలుగా అభిమానులకు కనిపించిందే లేదు. ఆ మద్య ఆర్ ఆర్ ఆర్‌ విడుదల అయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లాడు. అప్పుడు కనిపించిన ఎన్టీఆర్‌ మళ్లీ కనిపించలేదు. అందుకే ఎన్టీఆర్‌ ఇప్పుడు ఎలా కనిపిస్తాడో అనే ఆసక్తి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది.

బింబిసార ఈవెంట్‌ లో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడు.. ఆయన ఫిజిక్‌ ఎలా ఉంటుంది.. ఆయన హెయిర్ స్టైల్ మార్చి ఉంటాడా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ సినిమా షూటింగ్ ప్రారంభంకు రోజులు దగ్గర పడ్డాయి కనుక ఫిజిక్ దాదాపుగా మార్చి ఉంటాడు అని.. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్‌ ను కొత్త లుక్ చూస్తామని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

కొరటాల శివ సినిమా స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యిందని.. ఎన్టీఆర్‌ కూడా షూటింగ్‌ కు రెడీగా ఉన్నాడని సమాచారం అందుతోంది. కేవలం నాలుగు నెలల్లోనే సినిమా షూటింగ్ ను ముగించేలా దర్శకుడు కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నాడని కూడా సమాచారం అందుతోంది. ఆ వెంటనే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించాల్సి ఉంది.