Begin typing your search above and press return to search.
'కొమరం భీమ్'గా చరిత్ర సృష్టించనున్న ఎన్టీఆర్!
By: Tupaki Desk | 27 May 2021 5:30 AM GMTనందమూరి ఫ్యామిలీతో పరుచూరి బ్రదర్స్ కి మంచి అనుబంధం ఉంది. ఎన్టీ రామారావుగారి ఎన్నో విజయవంతమైన సినిమాలకి వారు పనిచేశారు. అలాగే బాలకృష్ణ మాస్ ఇమేజ్ ను మరింతగా పెంచుతూ వారు ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు. ఆ తరువాత యంగ్ ఎన్టీఆర్ కి సినిమాల విషయంలోను వారు తమ కలం బలం చూపించారు. పరుచూరి గోపాలకృష్ణ దగ్గర ఎన్టీఆర్ కి ఎంతో చనువు ఉంది. ఎన్టీఆర్ అంటే ఆయనకి కూడా ఎంతో అభిమానం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పరుచూరి గోపాలకృష్ణ, 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడారు.
"మొదటిసారిగా ఎన్టీఆర్ తో కలిసి 'ఆది' సినిమాకి పనిచేశాము. ఆ సమయంలోనే ఆయనతో మాకు అనుబంధం ఏర్పడింది. ఆ సినిమా షూటింగు సమయంలోనే ఆయన నా దగ్గరికి వచ్చి ''మిమ్మల్ని పెదనాన్న అని పిలవచ్చా?" అని అడిగినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. ఆ సినిమా షూటింగు సమయంలో ఆయనకి దెబ్బ తగిలింది అనగానే ఆ రోజంతా కూడా నాకు నిద్ర పట్టలేదు. ఆ సినిమా చూస్తున్నప్పుడే మాకు నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆ సినిమా సక్సెస్ కి ఆయన బాడీ లాంగ్వేజ్ ఎంతగానో ఉపయోగపడింది.
'ఆంధ్రావాలా' ఫంక్షన్ కి ఆయన నను గుర్తుపెట్టుకుని మరీ పిలిచాడు. ఆ ఫంక్షన్ కి వచ్చిన జనాన్ని చూస్తే మరొక ఎన్టీఆర్ ని చూసినట్టుగానే అనిపించింది. 'యమదొంగ'లో ఇంటర్వెల్ సీన్ చూసిన తరువాత తాతకు తగ్గ మనవడు అనిపించింది. ఆయనలా అంత హైట్ లేకపోయినా, ఆ పాత్రకి ఆ స్థాయిలో న్యాయం చేశాడు. 'స్టూడెంట్ నెంబర్ 1' .. 'సింహాద్రి' .. 'యమదొంగ' .. ఇలా రాజమౌళి దర్శకత్వంలో చేసిన మూడు సినిమాలతో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడు. త్వరలో రానున్న 'ఆర్ ఆర్ ఆర్'లో కొమరం భీమ్ గా కూడా ఆయన మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయమేనని అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చారు.