Begin typing your search above and press return to search.
వచ్చే సంక్రాంతి కి.. అయినను పోయి రావెలెను హస్తినకు
By: Tupaki Desk | 25 Jan 2020 5:18 AM GMTఈ సంక్రాంతి విజేతగా నిలిచిన అల వైకుంఠపురం తో మాంచి ఊపులో ఉన్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన తర్వాతి చిత్రాన్ని తారక్ తో చేస్తుండటం తెలిసిందే. మేలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. తన సినిమాకు ‘అ’ సెంటిమెంట్ మిస్ కాకుండా చూసుకుంటున్న త్రివిక్రమ్.. తారక్ తో చేసే సినిమాకు టైటిల్ విషయంలో డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.
ఈ సంక్రాంతికి మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిన అల వైకుంఠపురం మాదిరే.. వచ్చే సంక్రాంతి రేసులో ఉండాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. తారక్ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్న ఆయన.. తన తాజా సినిమా కు ‘అయిననూ పోయి రావలె.. హస్తినకు’ టైటిల్ గా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికం గా ప్రకటించాల్సి ఉంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రష్మిక నటిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ షూట్ లో బిజీగా ఉన్న తారక్.. తన షెడ్యూల్ ను మే నాటికి పూర్తి చేస్తారని.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా మీదనే ఫోకస్ చేస్తారని చెబుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత.. చిత్రం సక్సెస్ కావటమే కాదు.. తారక్ కు మంచి పేరు తీసుకొచ్చింది. తన సినిమాలకు అ అక్షరంతో టైటిల్ మొదలు పెడితే కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉండే త్రివిక్రమ్.. తాజా సినిమాకు అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేసినట్లుగా చెబుతున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కంటే కూడా హ్యాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏమైనా.. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు చాలానే బయట కు వస్తున్నా.. అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం రాక పోవటం గమనార్హం.