Begin typing your search above and press return to search.

వీరరాఘవుడికి అభయరాముడి పంచులు!

By:  Tupaki Desk   |   27 Aug 2018 7:18 AM GMT
వీరరాఘవుడికి అభయరాముడి పంచులు!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక పక్కా ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. సమయం దొరికితే చాలు ఎన్టీఆర్ తన పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేస్తుంటాడు. పెద్దబ్బాయి అభయ్ రామ్ తో గడిపే క్షణాలను ఒక్కోసారి సోషల్ మీడియా ద్వారా అబిమానులతో పంచుకుంటాడు కూడా.

తాజాగా ఎన్టీఆర్ అలాంటి ఒక వీడియోనే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ అంటే జస్ట్ బ్యూటేలే కాదు యంగ్ టైగర్లు.. బుల్లి టైగర్లు కూడా ఉంటారని మర్చిపోకండి. ఎన్టీఆర్ పోస్ట్ చేసిన వీడియోలో బుల్లి అభయ్ రామ్ సీరియస్ గా మొహం పై పంచ్ లు ఇస్తున్నాడు. ఎవరికి? ఇంకెవరికి.. వాళ్ళ నాన్నఎన్టీఆర్ కే. అసలే వారసుడు కదా.. పంచ్ లు ఇచ్చినా ముద్దుగానే ఉంటుంది. అందుకే ఈ వీడియో కు ఒక క్యాప్షన్ పెట్టాడు "మీరు కొడుక్కి పంచింగ్ బ్యాగ్ లా మారితే ఇలానే ఉంటుంది" అని కరాటే కిడ్ - పెద్ద కొడుకు - బద్దకంగా ఉండే ఆదివారం లాంటి ట్యాగ్ లు ఇచ్చాడు.

ఇక ఈ వీడియో కి పదహారు గంటల్లోనే దాదాపు 4 లక్షల లైకులు వచ్చాయంటే ఇక అభిమానులకు ఎంత నచ్చిందో అర్థం చేసుకోండి. వాళ్ళు 2 వేలకు పైగా కామెంట్లు కూడా పెట్టారు. సెలవు రోజు ఎన్టీఆర్ తను మాత్రమే ఎంజాయ్ చేయకుండా ఆ వీడియో ను షేర్ చేసి అందరికీ ఆనందాన్ని పంచాడు. ఇక సినిమాల సంగతి అయితే ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ' దసరా సీజన్ లో రిలీజ్ కానుంది.

వీడియో కోసం క్లిక్ చేయండి