Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ట్విట్టర్ హ్యాక్ చేసిందెవరు?
By: Tupaki Desk | 22 Dec 2015 4:04 AM GMT''నా సినిమా ఆడియో గురించి, రిలీజ్ గురించి నాక్కూడా తెలియడం లేదు. అస్సలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు..'' అని ఎవరైనా స్టార్ హీరో అంటే వెంటనే మీరేమనుకుంటారు? బిజినెస్ సర్కిల్స్ లో ఎలాంటి వైరల్ డిస్కషన్ జరుగుతుంది? ఓసారి ఊహించండి. అలాంటి మాట హీరో నోటి వెంట వస్తే ఇంకేదో జరిగిపోతోందన్న సందేహాలు రావడం చాలా సహజం. దర్శకనిర్మాతలతో హీరోకి సత్సంబంధాలు లేవని అనుకోవచ్చు. లేదూ మూవీ షూటింగుకి సంబంధించి క్లారిటీ మిస్సయ్యిందన్న సంకేతాలు ఇచ్చినట్టవుతుంది.
గత మిడ్ నైట్ లో ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ అయిన కామెంట్ చూసి నందమూరి అభిమానులంతా కంగారు పడిపోయారు. ఫ్యాన్స్ లో వైరల్ గా డిస్కషన్ సాగింది. అసలేమైంది. ఎన్టీఆర్ ఇలా ట్వీటారేంటి? అన్న చర్చ ముదిరిపాకన పడింది. మరోవైపు ట్రేడ్ వర్గాల్లోనూ పెద్ద కంపనం మొదలైంది. అసలేం జరుగుతోంది? అని ఎన్టీఆర్ అనడం ఏంటి? అన్న చర్చ సాగింది.
అభిమానులు అడుగుతున్నారు.. నాన్నకు ప్రేమతో ఆడియో డేట్ - రిలీజ్ డేట్ గురించి. నాకే తెలియడం లేదు. అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు.. అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ లో కామెంట్ ప్రత్యక్షమైంది. ఖంగు తిన్న ఫ్యాన్స్ ఇలా రాశారేంటి? అని ఆరాలు తీయడం మొదలెట్టారు. అయితే తన ట్విట్టర్ లో ఇలా రాసినట్టు ఎన్టీఆర్ కి తెలిసేసరికే ఎంతో పెద్ద డ్యామేజీ జరిగిపోయింది. వెంటనే పోస్టింగును అయితే తొలగించారు కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. సదరు ట్వీట్ ను డిలీట్ చేసి.. ''నా ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా'' అంటూ మరో పోస్ట్ చేశాడు ఎన్టీఆర్.
అయితే ఆన్ లైన్ హ్యాకింగ్ అనేది నేటి ట్రెండ్. సైబర్ నేరాల్లో ఇది పీక్స్ లో ఉందిప్పుడు. ఒకవేళ ఎన్టీఆర్ ట్విట్టర్ ని ఎవరైనా హ్యాక్ చేసి ఇలాంటి న్యూగేమ్ స్టార్ట్ చేసి ఉంటారా? లేక ట్విట్టర్ ని హ్యాండిల్ చేసేవాళ్లే ఇమెచ్యూర్డ్ గా ఇలా పోస్టింగ్ చేసేశారా? అన్నది తేలాల్సి ఉంది. అదంతా ఓకె.. హ్యాక్ అయిందని చెప్పినప్పుడైనా రిలీజ్ డేట్ గురించి చెప్పలేదేంటి తారకూ??