Begin typing your search above and press return to search.

రాముని సన్నిధిలో తారక రాముడు

By:  Tupaki Desk   |   10 Nov 2017 7:39 AM GMT
రాముని సన్నిధిలో తారక రాముడు
X
వరస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కెరీర్ లో తొలిసారి త్రిపాత్రిభినయం చేసిన జైలవకుశలో అతడి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. దీంతోపాటు మాటీవీలో ప్రసారమైన బిగ్ బాస్ షో కోసం తొలిసారి టీవీ హోస్ట్ అవతారమెత్తి సూపర్ సక్సెస్ సాధించాడు. దీంతో ఒకేటైంలో ఎన్టీఆర్ కు డబుల్ సక్సెస్ వచ్చినట్టయింది.

వరస విజయాల నేపథ్యంలో ఎన్టీఆర్ భద్రాచలం వెళ్లాడు. ఫ్యామిలీతో సహా సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాడు. ఆలయం మొత్తం తిరిగి ఆ క్షేత్రం విశిష్టతలను అడిగి తెలుసుకున్నాడు. ఈ టూర్ లో జనతా గ్యారేజ్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఎన్టీఆర్ వెంట ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా డైరెక్ట్ చేస్తున్న కొరటాల శివ షూటింగ్ లో గ్యాప్ తీసుకుని సతీసమేతంగా ఎన్టీఆర్ వెంట వచ్చి స్వామివారికి పూజలు చేశారు. వీళ్లతోపాటు కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా సీతారాములను దర్శించుకున్నారు.

జైలవకుశ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే క్లాప్ కూడా కొట్టేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ 25వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.