Begin typing your search above and press return to search.

యంగ్ టైగర్.. ప్యాన్ ఇండియా టార్గెట్!

By:  Tupaki Desk   |   8 Jun 2019 6:38 AM GMT
యంగ్ టైగర్.. ప్యాన్ ఇండియా టార్గెట్!
X
ఈమధ్య మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర భాషల్లో మార్కెట్ సంపాదించడం కోసం డబ్బింగ్ వెర్షన్స్ ను ఆయా రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం.. ఒక్కోసారి ద్విభాషా చిత్రాలు చేయడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తైతే రాజమౌళి లాంటి దర్శకుడితో పనిచేయడం మరో ఎత్తు. ఎందుకంటే రాజమౌళి సినిమాలో నటిస్తే ఆటోమేటిక్ గా ప్యాన్ ఇండియా రికగ్నిషన్ వస్తుంది. ఇండియా ఏం ఖర్మ... ఇంటర్నేషనల్ గా కూడా గుర్తింపు రావడం ఖాయమే. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ రామ్ చరణ్ కు 'RRR' తో అలాంటి అవకాశమే లభించింది. అయితే అటు ఎన్టీఆర్ కానీ ఇటు చరణ్ కానీ తమ తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం లేదు.

చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి ఇంకా క్లారిటీ లేదు కానీ ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి మాత్రం రీసెంట్ గా కొన్ని హింట్స్ వచ్చాయి. 'కె. జీ.ఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో ఉంటుందని అంటున్నారు. రాజమౌళి బాటలోనే ప్యాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్న దర్శకుడు కాబట్టి ప్రశాంత్ నీల్ తో చేయడం ఎన్టీఆర్ కెరీర్ కు బెస్ట్ డెసిషన్ అనే చెప్పాలి. రాజమౌళి 'RRR' తర్వాత ఎన్టీఆర్ కు ఇది మరో క్రేజీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

గతంలో ఇతర భాషలపై పెద్దగా ఫోకస్ చెయ్యని ఎన్టీఆర్ 'RRR' తో తన స్ట్రేటజీని మార్చుకున్నాడని అనుకోవచ్చు. ఎలాగూ డబ్బింగ్ సినిమాల్ ద్వారా ఎన్టీఆర్ హిందీ ఆడియన్స్ కు పరిచయమే కాబట్టి స్ట్రాంగ్ కంటెంట్ ఉండే సినిమాలు.. మంచి ప్రాజెక్టులు ఎంచుకుంటే ప్యాన్ ఇండియా మార్కెట్ సాధించడం అసాధ్యమేమీ కాకపోవచ్చు. ఇక ప్రశాంత్ నీల్ తో కాకుండా మరో ప్రాజెక్ట్ తమిళ దర్శకుడు అట్లీ తో ప్లాన్ చేస్తున్నాడని కూడా ఉంటున్నారు. విజయ్ తో బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిట్స్ సాధించిన అట్లీతో సినిమా కూడా మంచి ఛాయిస్. మరి ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో యంగ్ టైగర్ కెరీర్ ఎలా టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.