Begin typing your search above and press return to search.
రొమాన్స్ లో వీకంటున్న ఎన్టీఆర్
By: Tupaki Desk | 10 Jan 2016 7:03 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ స్ట్రెంగ్త్ గురించి చెప్పాల్సొస్తే చాలానే చెప్పొచ్చు. డైలాగులు అదరగొడతాడు. డ్యాన్సులు ఇరగదీస్తాడు. ఫైట్లలో దుమ్ము దులిపేస్తాడు. ఇన్ని ప్లస్సులున్నాయి కాబట్టి ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ కథానాయకుడు అయిపోయాడు. మాస్ లో కనీ వినీ ఎరుగని విధంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇటీవలే ఆయన 25వ సినిమాని పూర్తి చేసుకొన్నాడు. కథానాయకుడిగా 15యేళ్లుగా ప్రయాణం చేస్తున్నాడు. నటనలో మీ శైలి ఎలా ఉంటుందన్న విషయం గురించి ఇటీవల తారక్ ని విలేకరులు అడిగారు. ``అదేంటోనండీ.... ఎవరేం చెప్పినా నేను పర్సనల్ గా తీసుకొని మరీ నటిస్తుంటా. అలా ఫీలవ్వకపోతే నేను నటించలేను`` అని చెప్పుకొచ్చాడు తారక్.
రొమాన్స్ విషయంలోనూ అంతేనా అని అడిగితే... ``భలే వారండీ మీరు.. రొమాన్స్ లో పర్సనల్ గా ఎలా తీసుకుంటాం అని నవ్వేశాడు తారక్. ``నిజం చెప్పాలంటే కెమెరా ముందు రొమాన్స్ చేయడంలో నేను వీక్. రాజమౌళిగారు కూడా అదే అంటుంటారు. అన్నీ బాగా చేస్తావు కానీ... రొమాంటిక్ సన్నివేశాల దగ్గరికొచ్చేసరికి బిగుసుకుపోతుంటావెందుకు? అని. అదేంటోనండీ... నాకు రొమాన్స్ సెట్టవదంతే అన్నాడు తారక్. నా భార్య కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో ఎందుకలా ఇబ్బందిగా కనిపిస్తుంటారని అడుగుతోందని చెప్పుకొచ్చాడు తారక్. మరి రకుల్ లాంటి స్లిమ్ బ్యూటీతో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతోలో రొమాన్స్ ఎలా పండించాడో చూడాలి. పోస్టర్లు మాత్రం కుర్రాళ్లని భలే ఊరిస్తున్నాయి.