Begin typing your search above and press return to search.
RRR కోసం ఎన్టీఆర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు..!
By: Tupaki Desk | 21 Dec 2021 4:33 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలో అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - శ్రీయా - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. కొత్త ఏడాదిలో రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ కోసం ఇప్పుడు యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. ఇప్పటికే విడుదలైన RRR ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఈ క్రమంలో ఓ వైపు ఇంటర్వ్యూలు - స్పెషల్ ఈవెంట్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరోవైపు సరికొత్త పోస్టర్లు - గ్లింప్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సినిమాలో ఒక్కో ప్రధాన పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని వదులుతున్న చిత్ర బృందం.. లేటెస్టుగా ఎన్టీఆర్ వీడియోని రిలీజ్ చేసింది.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవవీరుడు కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. దీని కోసం తారక్ ఎంతలా కష్టపడ్డాడు అనేది మేకింగ్ వీడియో చూస్తే అర్థం అవుతుంది. అడవిలో పరిగెత్తే సన్నివేశాలు - డూప్ లేకుండా చేసే రిస్కీ షాట్స్ - బైక్ డ్రైవింగ్ - మాస్క్ పెట్టుకుని ప్రాక్టీస్ చేసే దృశ్యాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
అలానే సెట్ లో ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చిత్రీకరణ జరిగిందనేది ఈ మేకింగ్ వీడియో చూపిస్తోంది. ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన 'స్టూడెంట్ నెం.1' 'సింహాద్రి' 'యమదొంగ' వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వీరి కలయికలో రూపొందిన 'ఆర్.ఆర్.ఆర్' కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
RRR చిత్రం నుంచి ఇప్పటికే అజయ్ దేవగన్ - ఆలియా భట్ పాత్రలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసారు. త్వరలోనే రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు స్పెషల్ వీడియో రిలీజ్ కానుంది.
ఇకపోతే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.
కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతా రామారాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని తెరకెక్కించారు.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ ఫిక్షనల్ పీరియాడికల్ స్టోరీ రాయగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
డి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. పెన్ స్టూడియోస్ జయంతిలాల్ గడా ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పొందారు.
అలానే వరల్డ్ వైడ్ అన్ని భాషల ఎలక్ట్రానిక్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశారు. 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'బాహుబలి' తర్వాత జక్కన్న తెరకెక్కించిన ఈ విజువల్ వండర్.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.