Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ 30 .. ఫ్యాన్స్ పైకి బాంబ్ విసిరారు!
By: Tupaki Desk | 1 Jan 2023 6:36 AM GMTఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త వెలువడింది. మోస్ట్ అవైటెడ్ తారక్ మూవీ రిలీజ్ తేదీ లాక్ అయ్యింది. ఇది ఫ్యాన్స్ కి సిసలైన కొత్త సంవత్సర కానుక అనడంలో సందేహం లేదు. ఇక అభిమానుల్లో నూతనోత్సాహం మొదలైనట్టే. జనతా గ్యారేజ్ తర్వాత తన స్నేహితుడు కొరటాలతో ఎన్టీఆర్ భారీ ప్రయోగం చేస్తున్నాడని ఇప్పటికే కథనాలొచ్చాయి. రొటీన్ కి భిన్నంగా ఈసారి ఈ జోడీ పాన్ ఇండియా మార్కెట్ ని ఢీకొట్టే ప్రణాళికతో దూసుకొస్తోంది.
యంగ్ యమ ఎన్టీఆర్ ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో మాస్ లో దుమారం సృష్టించబోతున్నాడని తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ వెల్లడిస్తోంది. ఈ మూవీకి తాత్కాలికంగా ఎన్టీఆర్ 30 అని పేరు పెట్టారు. త్వరలోనే టైటిల్ ని ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశను దాటుకుని చిత్రీకరణకు వెళుతున్నామని మేకర్స్ పోస్టర్ లో వెల్లడించారు.
కొత్త సంవత్సరం సందర్బంగా నిర్మాతలు అందించిన ఈ వార్తతో తారక్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే సంక్రాంతి ముందే ఇది వారికి ప్రత్యేక పండగగా మారింది. ఈ సినిమా 5 ఏప్రిల్ 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. వచ్చే నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తారక్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్- యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ 1 సెప్టెంబర్ 2016న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల తర్వాత రెండోసారి ఈ కాంబినేషన్ రిపీటవుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తారక్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారని తెలిసింది. రిలీజ్ తేదీని చాలా తెలివిగా పండుగ సీజన్ చూసుకుని మరీ లాక్ చేసారు. ఉగాది - ఈద్ పండుగలను జాయింట్ గా ఎన్ క్యాష్ చేసుకునే తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు.
కొరటాల ఎంపికపై తారక్ కి ఎప్పుడూ నమ్మకం ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ తో తారక్ ఇమేజ్ అమాంతం పదింతలైంది. ఇప్పుడు అతడు పాన్ ఇండియా స్టార్. అందుకు తగ్గట్టే యూనివర్శల్ అప్పీల్ ఉన్న స్టోరీని కొరటాల ఎంచుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ చిత్రీకరణ ఆలస్యమైనా కానీ స్క్రిప్టు పరంగా ఎలాంటి డైలమాలు లేకుండా టీమ్ ఇప్పుడు ఎంతో ధీమాగా చిత్రీకరణకు వెళుతోందని తెలిసింది. శ్రీకర్ ప్రసాద్ లాంటి సీనియర్ ఈ చిత్రానికి ఎడిటర్ కాగా రత్నవేలు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ ను సాబు సిరిల్ హ్యాండిల్ చేస్తున్నారు. కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాతగా కొనసాగుతున్నారు.