Begin typing your search above and press return to search.
'ఎన్టీఆర్ - కొరటాల' ప్రాజెక్ట్ క్రేజీ అప్డేట్స్..!
By: Tupaki Desk | 18 Sep 2021 7:31 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న #NTR30 సినిమాకు సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు నటీనటులు - సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ షూటింగ్ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు తారక్ ప్లాన్ చేస్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.
అదేంటంటే.. #NTR30 చిత్రాన్ని 180 రోజుల్లోనే (6 నెలలు) పూర్తి చేయాలని కొరటాల శివ కు ఎన్టీఆర్ చెప్పారట. 2018 లో 'అరవింద సమేత' తర్వాత బిగ్ స్క్రీన్ పై కనిపించని తారక్.. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ప్రస్తుతం చేస్తున్న 'ఎవరు మీలో ఎవరు కోటీశ్వరులు' గేమ్ షో కి కొన్ని డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇలా గత మూడేళ్ళలో ఎన్టీఆర్ సినిమాల సంఖ్య తగ్గింది. దీంతో రానున్న ఏడాదిలో మరిన్ని సినిమాలు చేయాలనే ఉద్దేశంతో శరవేగంగా షూటింగులు చేయాలని తారక్ నిర్ణయించుకున్నారట.
ఈ నేపథ్యంలో కొరటాల శివ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లను వీలైనన్ని తక్కువ రోజుల్లో కంప్లీట్ చేయాలనే కండిషన్ తోనే నందమూరి హీరో డేట్స్ ఇచ్చారట. కాగా, 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత తారక్ - కొరటాల కాంబోలో సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీకి 'డైమండ్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ శైలిలో సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ కథ సిద్ధం చేస్తున్నారట. ఇందులో స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారని టాక్.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం కోసం వివిధ భాషల ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని ఖరారు చేసినట్లు సమాచారం. అలానే తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ - ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ (ఎన్టీఆర్ ఆర్ట్స్) సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.