Begin typing your search above and press return to search.
నెవర్ బిఫోర్ క్యారెక్టర్ తో 'ఎన్టీఆర్ 30' మూవీ..!
By: Tupaki Desk | 10 May 2021 10:30 AM GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సక్సెస్ లతో పాటు వరుసగా సినిమాసినిమాకు వేరియేషన్స్ - డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్ లతో నందమూరి అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ గా అవతరించనున్నాడు ఎన్టీఆర్. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ 30వ మూవీ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇదివరకు ఈ కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సూపర్ హిట్ కాంబో సెకండ్ టైం జతకట్టే సరికి సినిమా పై ఇప్పటినుండే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.
ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' మూవీ తెరకెక్కిస్తున్నాడు. గత రెండేళ్లుగా కొరటాల ఇదే సినిమా పై పనిచేస్తున్నాడు. నిజానికి గతేడాది విడుదల కావాల్సిన ఆచార్య మూవీ.. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి వాయిదాపడుతూ వచ్చింది. ఆఖరికి ఈ ఏడాది మేలో రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్రకటించగా.. ఈసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. చివరిదశలో ఉన్నటువంటి ఆచార్య షూటింగ ఆగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో మూవీ ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం షూటింగ్ లేనందున ఆ సమయాన్ని ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం కేటాయిస్తున్నాడు. కానీ ఈసారి స్క్రిప్ట్ లో భారీ మార్పులతో పాటు సాలిడ్ సబ్జెక్టు కూడా ఉండబోతుందని టాక్.
ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ పరిచయం కాబోతున్నాడు. అంటే ఇకపై ఎన్టీఆర్ కూడా అలాంటి పాన్ ఇండియా సబ్జెక్టులు చేసే అవకాశం ఉంది. అయితే ఆ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొనే కొరటాల బృందం స్క్రిప్ట్ సిద్ధం చేస్తోందట. మరి కొరటాల సినిమాలు అంటేనే ఖచ్చితంగా సందేశత్మకంగా ఉంటాయి. మరి ఈసారి ఎలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీయనున్నాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ తిరుగుబాటు దారుడుగా కనిపించనున్నట్లు సమాచారం. అదే క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నాడట కొరటాల. అదిగాక ఇటీవలే సినిమా అనౌన్స్ మెంట్ తో పాటుగా 2022 ఏప్రిల్ 22న సినిమా రిలీజ్ అని డేట్ కూడా ప్రకటించారు. ఈ సినిమాను మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తుండగా.. కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నాడు.