Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌30 : మరికొంత సమయం కావాలట!

By:  Tupaki Desk   |   10 May 2022 8:30 AM GMT
ఎన్టీఆర్‌30 : మరికొంత సమయం కావాలట!
X
ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్‌ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రాజమౌళితో సినిమా తర్వాత ఏ హీరో అయినా తదుపరి సినిమా విషయంలో నిరాశ ఎదుర్కోవల్సిందే తప్పదు అంటూ పలు సందర్బాల్లో ఇప్పటికే నిరూపితం అయ్యింది. తాజాగా రామ్‌ చరణ్ కు ఆచార్య సినిమా తో ఆ ఫలితం ఎదురయ్యింది. ఇక ఎన్టీఆర్‌ కు ఆయన 30వ సినిమా తో నిరాశ తప్పక పోవచ్చు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆ సెంటిమెంట్‌ ను ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేస్తానంటూ కొరటాల శివ ఈ సారి పట్టుదలతో ఉన్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్‌ 30 సినిమా కొరటాల శివ ల కాంబో మూవీ పట్టాలెక్కాల్సి ఉంది. కాని ఆర్ ఆర్‌ ఆర్ ఆలస్యం అవ్వడం.. ఆ తర్వాత ఆచార్య రావడం వంటి కారణాలతో సినిమా ను వెనక్కు నెట్టుకుంటూ వస్తున్నారు. ఆచార్య సమయంలో ఖచ్చితంగా ఎన్టీఆర్‌ 30 సినిమా జూన్ లో ప్రారంభిస్తామన్నారు.

ఆచార్య ఫలితం తర్వాత కొరటాల శివ కాస్త సమయం కావాలంటూ ఎన్టీఆర్‌ ను అడిగాడట. ఆచార్య విడుదల అయిన తర్వాత కొరటాల స్వయంగా వెళ్లి ఎన్టీఆర్‌ ను కలిశాడని వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలో స్క్రిప్ట్‌ విషయంలో మార్పులు చేర్పులు చేద్దాం అంటూ సూచించాడట. ఇప్పటికే దాదాపుగా పూర్తి అయిన స్క్రిప్ట్ వర్క్ ను మళ్లీ చేయాలనే ఉద్దేశ్యంతో కొరటాల శివ సమయం అడిగాడనే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్‌ సినిమాకు చాలా ఎక్కువ సమయం కేటాయించడం వల్ల అభిమానులు కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు కొరటాల శివ సినిమా అయినా వెంటనే ప్రారంభించాలని కోరుకుంటున్నారు.

అయినా కూడా సినిమా బాగా రావాలనే ఉద్దేశ్యంతో కొరటాలకు మరికొంత సమయం ను ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు లేదా సెప్టెంబర్‌ కు ఎన్టీఆర్‌ 30 సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఎన్టీఆర్‌ 30 సినిమా గురించి పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయం లో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆలియా భట్‌ ను లేదా జాన్వీ కపూర్‌ ను ఈ సినిమా లో ఎన్టీఆర్‌ కు జోడీగా నటింపజేయాలని కొరటాల భావించాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్‌ పూర్తి కాలేదు కనుక హీరోయిన్ విషయం క్లారిటీ రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.