Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ 30 మరో అడుగు పడింది... నిర్మాత డోర్స్ ఓపెన్‌

By:  Tupaki Desk   |   12 Dec 2022 9:30 AM GMT
ఎన్టీఆర్ 30 మరో అడుగు పడింది... నిర్మాత డోర్స్ ఓపెన్‌
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ 30వ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు. ఆ మధ్య సినిమా క్యాన్సిల్‌ అయ్యిందా అంటూ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. కానీ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ 30 గురించి కొరటాల శివ అప్డేట్‌ ఇస్తూ వస్తున్నాడు.

తాజాగా కొరటాల శివ స్టోరీ సిట్టింగ్స్ మరియు మ్యూజిక్‌ సిట్టింగ్స్ కు సంబంధించిన ఫొటోలు విడుదల చేయడం ద్వారా సినిమా లైన్ లోనే ఉందని.. ఎన్టీఆర్ త్వరలోనే షూటింగ్‌ లో జాయిన్ అవుతాడు అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే సినిమా యొక్క నిర్మాణ సంస్థ యువసుధ వారి యొక్క ఆఫీస్‌ ను ఓపెన్ చేయడం జరిగింది.

యువసుధ వారు గత 15 సంవత్సరాలుగా ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఇప్పుడు నిర్మాణ రంగంలో ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబో సినిమా తో అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. నిర్మాణ సంస్థ కోసం హైదరాబాద్‌ లో కొత్త ఆఫీస్ ను తెరిచారు. కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరు అయ్యారు.

సుధాకర్ మిక్కిలినేని కి చెందిన యువ సుధ బ్యానర్‌ ఆఫీస్ ప్రారంభోత్సవంకు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు.. దానయ్య... దర్శకుడు కొరటాల శివ ఇంకా పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కూడా హాజరు అవ్వాల్సి ఉన్నా కూడా విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేదు అంటూ సమాచారం అందుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.