Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్30 రెండు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్
By: Tupaki Desk | 29 Jan 2022 6:30 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కమిట్ అయ్యి దాదాపుగా నాలుగు ఏళ్లు అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మరే సినిమాను ఎన్టీఆర్ మొదలు పెట్టలేదు. గత ఏడాదిలోనే తన 30వ సినిమా ను కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు. కాని కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆలస్యం అవ్వడంతో పాటు విడుదల వాయిదాలు పడుతూ వస్తుంది. దాంతో కొరటాల శవ సినిమాను వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 సినిమా పట్టాలెక్కే సమయం వచ్చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో పాటు విడుదలకు సిద్దంగా ఉంది. దాంతో భారీ అంచనాల నడుమ కొరటాల శివ సినిమా ను మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఎన్టీఆర్ మరియు కొరటాల శివలకు టైమ్ కలిసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఫిబ్రవరి నుండి షూటింగ్ ను మొదలు పెట్టేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబో సినిమా గురించి ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. షూటింగ్ ప్రారంభంకు ముందు రెండు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ను యూనిట్ సభ్యులు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో మొదటి అప్‌డేట్ ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమా లో ముద్దుగుమ్మ ఆలియా భట్ హీరోయిన్ గా నటించబోతుంది. ఆ విషయాన్ని ఒక ప్రత్యేక సందర్బంలో అనౌన్స్ చేసే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఆ ప్రకటన ఫిబ్రవరిలో ఉంటుందని తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడి పేరును కూడా అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. సినిమా కోసం అనిరుధ్ రవిచంద్రన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడం జరిగిందట. ఆ విషయాన్ని కూడా ఫిబ్రవరి నెలలో అధికారికంగా వెళ్లడించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ 30 కి సంబంధించిన కొత్త అప్‌డేట్స్ అధికారికంగా రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. కనుక కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కోసం చాలా సమయం కేటాయించాడు.. అంతే కాకుండా కరోనా వల్ల కనీసం ఏడాదికి పైగా సమయం వృదా అయ్యింది. ఈ మొత్తం ను కవర్ చేసేలా ఎన్టీఆర్ రాబోయే రెండు మూడు ఏళ్లలో ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలను తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే ఇప్పటికే కొరటాల శివ సినిమా ను కేవలం అయిదు ఆరు నెలల్లోనే పూర్తి చేయాల్సిందిగా కండీషన్ పెట్టాడట. అంతే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరియు బుచ్చి బాబు దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు ఎన్టీఆర్ వెయిట్ చేస్తున్నాడు. ఆ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అందులో భాగంగా ఎన్టీఆర్ 30 సినిమా రెండు అప్డేట్స్ వచ్చే నెల ఆరంభంలోనే రాబోతున్నాయి. ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని ఈ సందర్బం కోసం కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నారు. కనుక ఫిబ్రవరి నెల ఎన్టీఆర్ అభిమానులకు చాలా స్పెషల్ గా ఉండబోతుంది.