Begin typing your search above and press return to search.

నైజాంలో రాముడి ఆట కట్టు

By:  Tupaki Desk   |   22 Jan 2019 6:55 AM GMT
నైజాంలో రాముడి ఆట కట్టు
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వినయ విధేయ రామ చెప్పుకోవడానికి 60 కోట్ల షేర్ అయితే ఇచ్చింది కాని నష్టాలు మాత్రం బయ్యర్లను గుక్క తిప్పుకోకుండా ఏడ్చేలా చేస్తున్నాయి. సంక్రాంతి సీజన్ కాకపోయి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదన్న మాటల్లో నిజముంది. ఇప్పుడు రెండు వారాలు తిరక్కుండానే ఫైనల్ రన్ కి రావడం అభిమానులను కలవరపరిచేదే. ఇప్పటికే చాలా సెంటర్స్ లో డెఫిసిట్లు మొదలైపోయాయి. వీటిని అలాగే కొనసాగిస్తే ఫైనల్ షేర్స్ తగ్గిపోయి నష్టాల శాతం పెరుగుతుంది.

ముఖ్యంగా నైజాంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సుమారు 17 కోట్ల దాకా థియేట్రికల్ హక్కులు కొనుకున్న దిల్ రాజుకు ఇప్పటిదాకా రికవరీ అయ్యింది 12 కోట్లే. ఎంత కొనసాగించినా ఇంకో కోటి కాదు కదా యాభై లక్షలు కూడా తోడయ్యే ఛాన్స్ లేదు. సో ముందుకు వెళ్ళే కొద్ది నష్టం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అర్జెంటు గా నెంబర్ ని తగ్గించాలి. ఈ మేరకు చర్యలు కూడా మొదలయ్యాయని సమాచారం.

దిల్ రాజు 5 కోట్ల దాకా నష్టాన్ని భరించాలి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల హక్కులు కొన్న యువికి 20 కోట్ల దాకా లెక్క తేడా వస్తుంది. నిర్మాత దానయ్య పాతిక శాతం వెనక్కు ఇచ్చేలా ఏదో ఒప్పందం జరిగిందంటున్నారు కాని క్లారిటీ రావాల్సి ఉంది. కాకపోతే ఎఫ్2 ఊహించిన దాని కన్నా ఎక్కువ లాభాలు కురిపించడం దిల్ రాజు కు ఊరట కలిగించే విషయం. మెయిన్ థియేటర్ తో పాటు కాసిన్ని ఉంచేసి 25 నుంచి వినయ విధేయ రాముని అన్ని థియేటర్లు తీసేయడం దాదాపు ఖాయమైనట్టే. సంక్రాంతి సీజన్ లో ఎన్టీఆర్ కథానాయకుడు తర్వాత పెద్ద డిజాస్టర్ గా వినయ విధేయ రామ నిలిచిపోయింది.