Begin typing your search above and press return to search.
పారితోషికంలో నంబర్ వన్ విలన్
By: Tupaki Desk | 1 Nov 2019 5:14 AM GMTవిజయ్ సేతుపతి తమిళ్ లో పెద్ద హీరో. విలక్షణమైన నటుడు. ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేయగలడు. హీరో ఇమేజ్ చట్రం నుంచి బయటకొచ్చి సినిమాలు చేస్తోన్న ఏకైక నటుడు. సాధారణంగా స్టార్ హీరోగా గుర్తింపు వచ్చిన తర్వాత ఏ నటుడు ఆ స్థాయికి దిగి క్యారెక్టర్లు చేయరు. కానీ విజయ్ సేతుపతి రూటే సపరేటు. హీరో ఇమేజ్ ని- ఆర్టిస్ట్ ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. సేతుపతి మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేగలడనే నమ్మకం దర్శకుల్లో బలంగా నాటాడు. అది విజయ్ ట్యాలెంట్ కు తార్కాణం.
టాలీవుడ్ దర్శకులు సైతం విజయ్ ని వదిలిపెట్టడం లేదు. అతని ట్యాలెంట్ ని గుర్తించి ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తున్నారు. ఇటీవలే సైరా నరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడే తమిళ యోధుడిగా.. ఉయ్యాలవాడ అనుచరుడిగా నటించి మెప్పించాడు. విజయ్ కి ఆ సినిమా నటుడిగా మరింత గుర్తింపు ను తెచ్చి పెట్టింది. ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ రంగంలోకి దింపారు. తాజాగా సుకుమార్-బన్నీ సినిమాలో కూడా విజయ్ సేతుపతిని విలన్ గా తీసుకున్నారని ప్రచారమవుతోంది.
అందుకు గాను విజయ్ భారీగానే ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. 40 రోజుల షెడ్యూల్ కు గాను 6 కోట్లు డిమాండ్ చేసినట్లు వినిపిస్తోంది. విజయ్ డిమాండ్ ని నిర్మాతలు కూడా అంగీకరించారుట. మొత్తానికి విజయ్ వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. తెలివిగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఇమేజ్ ని పక్కన బెట్టి పాత్రలను ప్రేమించే నటుడు కాబట్టే చిన్న-పెద్ద సినిమా అనే తారతమ్యం లేకుండా కమిట్ అవుతున్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా తెలివిగా గేమ్ నడిపిస్తున్నాడు. సోనూసూద్- షాయాజీ- ముఖేష్ రిషి అంత పెద్ద విలన్లకు సైతం అందని పారితోషికం అందుకుంటున్నాడు తెలుగులో. ప్రస్తుతం ఉన్న విలన్లలోనే హయ్యెస్ట్ పెయిడ్ విలన్ గా పాపులరవుతున్నాడు. తమిళంలో హీరోగా తెలుగులో విలన్ గా అతడు డ్యూయల్ గేమ్ ఇంట్రెస్టింగ్.