Begin typing your search above and press return to search.
అది కూడా కాపడలేకపోతోంది
By: Tupaki Desk | 15 Feb 2018 10:15 AM GMTఎవరు ఎన్ని చెప్పినా, ఒక సినిమా హిట్ అవ్వాలంటే కేవలం పట్టుదల - కష్టపడటం మాత్రమే కాదు - లక్ కూడా ఉండాలి అన్నది వాస్తవమే. అందుకే చాలా వరకు మన స్టార్ హీరోలు - డైరెక్టర్లు సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. అదే విధంగా కొందరు న్యూమరాలజీ అంటూ పేర్లను మారుస్తూ ఉంటారు. కానీ ఇంత న్యూమరాలజీ - అయినా - అందరికి అది వర్క్ ఔట్ అవుతుందా?
మొట్ట మొదట చెప్పుకోవాల్సింది మనం మెగా హీరో గురించి. ఇంటెలిజెంట్ స్పెల్లింగ్ ను ఇంగ్లీషులో ఒక 't' ఎక్కువగా పడడంతో అందరూ అవాక్కయ్యారు. కానీ నిర్మాత సి.కళ్యాణ్ న్యూమరాలజీ ప్రకారంగా అలా టైటిల్ ను మార్చారు అని డైరెక్టర్ వినాయక్ చెప్పడంతో ఓహో అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే నెగటివ్ టాక్ తెచుకోవడంతో అందరూ నష్టపోయారు. అదే విధంగా తమన్నా కూడా పేరులో ah అతికించుకుంది. కానీ ఆమె స్కెచ్ సినిమా ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది. తరుణ్ కూడా తన పేరుకు th తగిలించి 'Tthharun' గా మార్చాడు. కానీ అతని 'ఇదే నా లవ్ స్టొరీ' సినిమా ఎప్పుడు వచ్చిందో ఎపుడు పోయిందో కూడా తెలియని పరిస్థితి.
అయిన మూఢ నమ్మకాలు కాకపోతే, అసలు పేరులో అక్షరం యాడ్ చేస్తే సినిమాలు హిట్ అవ్వడం ఏంటి విడ్డురం కాకపోతేను. ఏదేమైనా మన హీరోలు డైరెక్టర్లు మాత్రం ఈ నమ్మకాలను వదలట్లేదు. అలా వెళ్లి బోల్తా పడిన వారు మరెందరో ఉన్నారు ఇండస్ట్రీ లో. పాపం కొందరికి వర్క్ అయినా మరి కొందరిని న్యూమరాలజీ కూడా కాపడలేకపోతోంది.