Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో పీక్స్ కి చేరుతున్న న్యూమరాలజీ సెంటిమెంట్ !
By: Tupaki Desk | 19 Oct 2022 1:30 PM GMTసినిమా ఇండస్ట్రీలో నమ్మకాలకు, ముహూర్తలకు, సెంటిమెంట్ లకు పెద్ద పీట వేస్తుంటారన్నది తెలిసిందే. ఓ ప్రాజెక్ట్ ని ప్రకటించడానికి, ప్రారంభోత్సవానికి ముహూర్తాలు చూస్తుంటారు. అలాగే సినిమా డబ్బింగ్ మొదలైన రోజున కూడా ప్రత్యేక డేట్ ని అనుకుని డబ్బింగ్ ని ప్రారంభించడం.. షూటింగ్ చివరి రోజున మరోసారి ప్రత్యేకంగా పూజా నిర్వహించి గుమ్మడికాయ కొట్టడం.. బొమ్మ థియేటర్లలోకి వెళ్లడానికి రెడీ అయ్యే ప్రతీ క్షణాన్ని ప్రత్యేక డేట్ లని కోట్ చేసుకుంటూ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ .. ఇలా ప్రతీదీ జ్యోతీష్యులు చెప్పిన ముహూర్తం ప్రకారం చేస్తూ వుంటారు.
అంతే కాకుండా సినిమా ప్రారంభానికి ముందు ఆఫీస్ లని తీసుకునే క్రమంలోనూ ముహూర్తాలు, పద్దతులు పట్టింపులు చూస్తుంటారు. ఎంత భారీ ప్రాజెక్ట్, కోట్ల బడ్జెట్ .. కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టినా సరే ముహూర్తాలు, సెంటిమెంట్ ల ప్రకారమే నడుచుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. నిర్మాత, దర్శకులు, హీరోలు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఫాలో అవుతూ వస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సెంటిమెంట్, మేహూర్తాలతో ముడిపెడుతూ వస్తున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో ముహూర్తాలు, సెంటిమెంట్ లకు మించి న్యూమరాలజీకి అధిక ప్రాధాన్యత నివ్వడం మొదలుపెట్టారు. గతంలోనూ న్యూమరాలజీకి ప్రాధాన్యత నిచ్చినా భారీ స్థాయిలో దానిపైనే ఆధరపడేవారు కాదు కానీ ఈ మధ్య అదే ప్రధానంగా ఇండస్ట్రీలో వినిపించడం మొదలైంది. పేర్లు మార్పు దగ్గరి నుంచి మొదలైన ఈ న్యూమరాలజీ కార్ నెంబర్లు, డోర్ నెంబర్లు, ఉండే ఇంటికి సంబంధించిన ఫ్లోర్ వరకు వెళ్లింది.
దీని కోసం స్టార్స్ తో పాటు నిర్మాతలు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు లక్షలు ఖర్చు చేస్తున్నారు. గతంలో ముహూర్తాలకు మించి న్యూమరాలజీకే పట్టం కట్టిన సందర్భాలున్నాయి.
కొణిదెల శివశంక వర ప్రసాద్ పేరుని న్యూమరాలజీ ప్రకారం చిరంజీవిగా మార్చడం..అదే ఫార్ములాని ఫాలో అవుతూ కల్యాణ్ బాబు పేరుని కాస్తా పవన్ కల్యాణ్ గా మార్చడం.. గతంలో చూసుకుంటే ఇలా న్యూమరాలజీ ప్రకారం పేర్లు మార్చుకున్న స్టార్స్ చాలా మందే వున్నారు. శివాజీ రావ్ గైక్వాడ్ ఇదే ఫార్ములా ప్రకారం సూపర్ స్టార్ రజనీకాంత్ గా మారిన విషయం తెలిసిందే.
గతంలో ఇసీ ఇండస్ట్రీలో ప్రముఖ పాత్ర పోషించి హాట్ టాపిక్ గా మారిన న్యూమరాలజీ మళ్లీ టాలీవుడ్ లో పీక్స్ కి చేరుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య చాలా మంది స్టార్ ప్రొడ్యూసర్లు, హీరోలు ఏది చేసినా న్యూమరాలజీ ప్రకారం నడుచుకుంటున్నారు. దీంతో న్యూమరాలజీ టాలీవుడ్ లో పీక్స్ చేరినట్టుగా ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.