Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అక్కగారి గ్లామర్ బాటలో నడుస్తున్న చెల్లి

By:  Tupaki Desk   |   3 April 2019 9:16 AM GMT
ఫోటో స్టొరీ: అక్కగారి గ్లామర్ బాటలో నడుస్తున్న చెల్లి
X
'1 నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్లలో లిస్టులో కృతి పేరు కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో అయితే చాలా యాక్టివ్. ఇన్స్టాగ్రామ్ లో 19 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. ఈ అందగత్తెకు ఒక నూపుర్ సనన్ అనే చెల్లి ఉంది.. కృతి అందగత్తె అయితే నూపుర్ సుందరాంగి.

త్వరలో గ్లామర్ ఫీల్డ్ లో అడుగులు వేయాలని.. అక్కలాగే హీరోయిన్ గా రాణించాలని ఉబలాటపడుతోంది. అందుకే సోషల్ మీడియాలో గ్లామరస్ పోజులు ఇస్తూ నేను రెడీ అంటూ ఫిలిం మేకర్లకు హింట్స్ ఇస్తోంది. రీసెంట్ గా నూపూర్ GQ మ్యాగజైన్ వారి స్టైల్ అండ్ కల్చర్ అవార్డ్స్ 2019 ఈవెంట్ కు హాజరయింది. ఆ ఈవెంట్ లో ఒక రెడ్ కలర్ డిజైనర్ గౌన్ లో దర్శనమిచ్చింది. ఈ గౌన్ ను డిజైన్ చేసినవారు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శంతను నిఖిల్. ఈ డ్రెస్ లో ఫోటో షూట్ కు హాజరై ఆ ఫోటోలను తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

ఫోటోలో నూపూర్ ఎలా ఉంది అంటే..గ్లామర్ ను ఫుల్లుగా ఒలకబోసింది. స్లీవ్ లెస్ డిజైన్ తో పాటుగా థై స్లిట్ ఉండే గౌన్ కావడంతో క్లీవేజ్ ప్రదర్శనతో పాటుగా కాళ్ల అందాలను కూడా చూపించేసింది. ఈ భామ నెటిజనులకు కూడా నచ్చినట్టుంది. ఇన్స్టాగ్రామ్ లో అప్పుడే వన్ మిలియన్ ఫాలోయర్లు.. ఈ ఫోటోకేమో దాదాపు లక్ష లైకులు. త్వరలో హీరోయిన్ గా ఏదో ఒక సినిమాలో నటించడం ఖాయమే.