Begin typing your search above and press return to search.

ల‌వ‌ర్స్ డే బ్యూటీ ఎన్ని సెగ‌లో

By:  Tupaki Desk   |   26 Feb 2019 4:16 AM GMT
ల‌వ‌ర్స్ డే బ్యూటీ ఎన్ని సెగ‌లో
X
ఒకే సినిమా ఎన్నో శేష ప్ర‌శ్న‌ల్ని మిగిల్చింది. ఉవ్వెత్తున ప్ర‌చారం వ‌చ్చేస్తే థియేట‌ర్ల‌లో సినిమా జ‌నాల‌కు ఎక్కేస్తుందా? ప‌్ర‌చారంతో ఏ సినిమా అయినా హిట్టెక్కేస్తుందా? అంటే అస్స‌లు ఛాన్సే లేద‌ని ప్రూవైంది. అందుకు ఫ‌క్తు ఎగ్జాంపుల్ ల‌వ‌ర్స్ డే. ఈ సినిమాకి ఓ ర‌కంగా అమీర్ ఖాన్ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` కంటే ఎక్కువే ప్ర‌చారం సాగింది. బాహుబ‌లి త‌ర్వాత ల‌వ‌ర్స్ డే అన్న‌ట్టుగా ప్ర‌చారం వ‌చ్చింది. వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ క‌న్నుగీటుడు సెన్సేష‌న్స్ ప్ర‌చారం ప‌రంగా ఆ రేంజులో వ‌ర్క‌వుటైంది.

అయితే అచ్చులో బొమ్మ అక్క‌డే తిర‌గ‌బ‌డింది. క‌న్ను గీటి ప్ర‌పంచాన్ని త‌న పాదాక్రాంతం చేసుకున్న ప్రియా ప్ర‌కాష్ తొలి ప్ర‌య‌త్న‌మే ఫెయిల్యూర్ ని చూడాల్సొచ్చింది. బ‌న్ని అంత పెద్ద హీరోనే ప్ర‌చారం చేసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఇక తెలుగు వెర్ష‌న్ రిలీజ్ చేసిన నిర్మాత 10 రోజుల త‌ర్వాత రీషూట్ చేసిన క్లైమాక్స్ ని రీప్లేస్ చేస్తున్నామ‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దం అయ్యింది. ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ నేప‌థ్యంలో వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ పై కోస్టార్ రింగుల జుత్తు సోయ‌గం నూరీన్ చేసిన కామెంట్లు వేడెక్కించాయి. ప్రియా వ‌ల్ల తాను సైడ్ యాక్ట‌ర్ ని అయిపోయాన‌ని త‌న కోపాన్ని బ‌హిరంగంగానే వెల్ల‌గ‌క్కింది నూరీన్.

అయితే త‌న‌లోని మ‌ద‌నం ఎలా ఉందో చెప్పేందుకేనా? అన్న‌ట్టు నేడు తెలుగు మీడియా ముందుకు వ‌స్తోంది. అక్క‌డ మీడియా ఇంట‌రాక్ష‌న్ లో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌బోతోంది. చిక్లెట్ క‌ళ్ల‌తో డిజైన‌ర్ రింగుల జుత్తుతో నూరీన్ చేసిన మాయ త‌క్కువేమీ కాదు. కానీ ప్రియా ప్ర‌కాష్ వ‌ల్ల త‌న‌కి ఆ క్రెడిట్ ద‌క్క‌కుండా పోయిన మాట వాస్త‌వ‌మే. వీళ్లంతా ఇంకా ఆరంభంలో ఉన్న కిడ్స్ కాబ‌ట్టి న‌టీమ‌ణులుగా షైన్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. ల‌వ‌ర్స్ డే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నేడు నూరీన్ ఏం చెబుతుందో చూడాలి. మ‌రోవైపు ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో బ్యాన్ కి గురైన‌ టిక్ టాక్ లో నూరీన్ చిలిపి అల్ల‌రి విన్యాసాలు ప్ర‌స్తుతం కుర్ర‌కారు గుండెల్లో గుచ్చేస్తున్నాయ్. ఇదిగో త‌న‌ని తాను ఇలా ప్ర‌మోట్ చేసుకుంటూ వేడి పెంచుతోంది ఈ మ‌ల్లూ బ్యూటీ.